Breaking News

ఒకే ఒక కారణంతో 'ఐబొమ్మ రవి'కి బెయిల్‌

Published on Thu, 02/19/2026 - 10:21

సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి 90రోజుల తర్వాత చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో సినిమా లవర్స్‌ తనకు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు. రవి అరెస్టైన రోజు నుంచే సోషల్‌మీడియాలో సపోర్ట్‌గా నిలిచారు. ఒక సమయంలో ఏకంగా పోలీసులపై మీమ్స్‌ చేశారు. దీంతో హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ కూడా కామెంట్‌ చేశారు. ఉచితంగా సినిమాలను అందిస్తున్నారనే కారణంతో అలాంటి వారిని ప్రేక్షకులు ప్రోత్సహించకూడదని ఆయన హితవు పలికారు.

సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై పోలీసులు 5 కేసులు పోలీసులు నమోదు చేశారు. ఆపై అతని పాస్‌పోర్ట్‌ కూడా సీజ్‌ చేశారు. రవి కారణంగా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సినీ పెద్దలు చెప్పుకొచ్చారు. దీంతో రవి ఇక విడుదల కాలేడని నెటిజన్లు క్లారిటీకి వచ్చారు. అయితే, రవికి తాజాగా బెయిల్‌ రావడానికి ప్రధాన కారణం పోలీసులే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అరెస్టయిన 90 రోజుల తర్వాత కూడా పోలీసులు చార్జిషీట్‌ వేయకపోవడం వల్లనే ఐబొమ్మ రవికి బెయిల్‌ వచ్చింది. 

రవిని కస్టడీలోకి తీసుకుని పలుమార్లు విచారణ చేసినప్పటికీ పూర్తి వివరాలు పోలీసులు  రాబట్టలేకపోయారు. అరెస్టయిన తర్వాత 90రోజుల్లో చార్జిషీట్‌ వేయకపోతే నిందితుడు బెయిల్‌ కోసం వెళ్లొచ్చు. ఈ కారణంగానే రవికి బెయిల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు చార్జిషీట్‌ వేసేంత వరకు ప్రతిరోజు ఉదయం 11గంటల నుంచి సాయింత్రం 5గంటల లోపు ఎస్‌హెచ్‌ఓ వద్ద హాజరుకావాల్సిందేనని కోర్టు సూచించింది.

ఐబొమ్మ రవి జైల్లో ఉన్న సమయంలో కూడా ఎలాంటి ఢోకా లేకుండా మూవీ రూల్జ్ లాంటి పైరసీ వెబ్‌సైట్లు వాడుకలోనే ఉన్నాయి. రోజురోజుకి పుట్టుకొస్తున్న కొత్త వెబ్‌సైట్లతో పోలీసులకు అతిపెద్ద ఛాలెంజ్‌గా ఎదురైంది. సినిమా టికెట్‌ ధరలతో పాటు క్యాంటీన్‌లోని తినుబండారాల ఖర్చు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు కూడా థియేటర్‌కు వెళ్లలేకపోతున్నారు. దీంతో పైరసీలో సినిమా చూడటం తప్పని ప్రజలు ఫీల్ అవడం లేదని తెలిసిపోతుంది.
 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)