Breaking News

సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?

Published on Fri, 05/02/2025 - 14:31

సూర్య పేరుకే తమిళ హీరో. కానీ తెలుగులోనూ కోట‍్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే మన దగ్గర కూడా హౌస్ ఫుల్స్ పడతాయి. అలాంటిది గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు. సూర్య కోసమని తెలుగు ప్రేక్షకులు థియేటర్ కి వెళ్తున్నారు. కానీ అసంతృప్తితో బయటకు వస్తున్నారు. ఇంతకీ సూర్య ఎందుకిలా చేస్తున్నాడు? 

(ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)

ఈ మధ్య కాలంలో సూర్యకు థియేటర్లలో సరైన హిట్ అన్నదే పడట్లేదు. అదేంటి జై భీమ్, ఆకాశమే హద్దురా సినిమాలు హిట్ అయ్యాయి కదా మీరు అనుకోవచ్చు. కానీ ఇవి రెండూ లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైపోయాయి. కాబట్టి ఇవి థియేటర్ లెక్కలోకి రావు. 

2017లో సింగం 3 రిలీజైన తర్వాత సూర్య నుంచి గ్యాంగ్, ఎన్జీకే, బందోబస్త్, ఈటీ, కంగువ.. ఇప్పుడు రెట్రో సినిమా థియేటర్లలోకి వచ్చాయి. రెట్రో గురించి కాసేపు పక్కనబెడితే అంతకు ముందు విడుదలైన ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు రెట్రో చిత్రానికి కూడా తమిళంలో టాక్ ఓకే గానీ తెలుగులో మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా అయితే లేదు. ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కష్టమైవడం గ్యారంటీ. తమిళంలో ఇలానే ఉండే అవకాశాలు లేకపోలేదు.

(ఇదీ చదవండి: 'హిట్‌ 3' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. నాని కెరీర్‌లో ఇదే టాప్‌)

సూర్య యాక్టింగ్, కష్టపడటం ఏమన్నా తక్కువ చేస్తున్నాడా అంటే అస్సలు లేదు. కానీ అతిగా దర్శకుల్ని నమ్మడమే ఇతడికి మైనస్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది వచ్చిన 'కంగువ'పై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరో బాహుబలి అవుతుందనుకున్నాడు. డైరెక్టర్ శివని చాలా నమ్మాడు. కట్ చేస్తే ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది.

ఇప్పుడు రెట్రో విషయంలోనూ చాలామంది ప్రేక్షకులు సూర్యని ఏం అనట్లేదు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అసలు ఎందుకు ఇలాంటి సినిమా తీశాడా? సూర్య.. అసలు ఇలాంటి కథని ఎలా ఒప్పుకొన్నాడా అని మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం సూర్య చేతిలో ఆర్జే బాలాజీ తీస్తున్న '45', సార్-లక్కీ భాస్కర్ ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో తీయబోయే సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు 'వడివాసల్' చిత్రం కూడా ఉంది. వీటితోనైనా హిట్ కొట్టి సూర్య కమ్ బ్యాక్ ఇస్తే అభిమానులకు అదే హ్యాపీ. లేదంటే మాత్రం సూర్య చిత్రాన్ని చూసేందుకు థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల నమ్మకం తగ్గిపోతుంది.

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)