Breaking News

థియేటర్లలో కల్కి.. ఓటీటీకి వస్తోన్న సినిమాలేవో తెలుసా?

Published on Thu, 06/27/2024 - 17:29

వీకెండ్ వస్తోందంటే చాలు ఏ సినిమా థియేటర్లో రిలీజవుతోంది? ఏయే సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి? అంటూ ఒకటే చర్చ. అయితే  ఈ వారంలో థియేటర్లలో రిలీజయ్యే చిత్రాల గురించి ఆరా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించేది ఆ సినిమా ఒక్క పేరే. అదే ప్రభాస్- నాగ్ అశ్విన్‌ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ. ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియా వ్యాప్తంగా కల్కిమేనియా నడుస్తోంది. దీంతో థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌గా దర్శనమిస్తున్నాయి.

అయితే మరోవైపు ఈ వీకెండ్‌ ఓటీటీ సినిమాలు ఏంటనేది ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. సినీ ప్రియులను అలరించేందుకు కార్తికేయ హీరోగా ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం భజే వాయు వేగం, నవదీప్‌ నటించిన సినిమా లవ్‌ మౌళి ఓటీటీ సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. వీటితో పాటు 
పృథ్వీరాజ్‌ సుకుమారన్ చిత్రం గురువాయుర్‌ అంబలనాదయిల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది.  మరీ ఈ వీకెండ్‌ ఓటీటీకి వచ్చేస్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై మీరు ఓ లుక్కేయండి.


నెట్‌ఫ్లిక్స్‌
  
ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 28

ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 28

ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) - జూన్ 28

భజే వాయు వేగం(తెలుగు సినిమా)- జూన్ 28


అమెజాన్‌ప్రైమ్‌

సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 28

శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) - జూన్ 28

జీ5
   రౌతూ కా రాజ్‌ (హిందీ) జూన్‌ 28


డిస్నీ+హాట్‌స్టార్‌

   ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) - జూన్ 28


ఆపిల్‌ టీవీ ప్లస్‌
   ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 28

   వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 28

సైనా ప్లే

   హిగ్యుటా (మలయాళ సినిమా) - జూన్ 28

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)