బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..
Breaking News
థియేటర్లలో భోగి.. ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 21 సినిమాలు
Published on Mon, 11/23/2026 - 09:33
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఇప్పటికే థియేటర్లలో ఆకాశంలో ఒకతార, ఈఎన్ఈ రిపీట్ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ వీక్ కూడా బోలెడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఈ శుక్రవారం శర్వానంద్ హీరోగా వస్తోన్న భోగి ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీపై టాలీవుడ్ అభిమానుల్లో బజ్ నెలకొంది. ఈ సినిమాతో పాటు హే కన్నమ్మ, హై, డేంజర్ బాయ్స్, ది మేజ్, పూలే లాంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిపై అంతగా బజ్ లేదు.
ఇక ఓటీటీ విషయానికొస్తే ఈ వారంలో బోలెడ్ చిత్రాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. ఈ వీక్‌లో అజయ్ దేవగణ్ దృశ్యం-3 ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్ కూడా ఈ వారంలోనే ఓటీటీకి రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు వెంకీ ఆదర్శకుటుంబం కూడా స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ది ట్రయల్స్ ఆఫ్ కరెన్ రీడ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 23
రోల్ లోవే- ది అవుట్‌సైడర్(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 24
ది మస్కిటో బౌల్-(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25
స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 26
ఆల్వేస్ ఆన్ కాల్(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 26
ఫూల్ నైట్(జపనీస్ సినిమా)- నవంబర్ 26
ది హంటింగ్ వైవ్స్-సీజన్ 2-(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 26
టూస్- ది వాన్‌డెర్ వాక్ కిడ్నాపింగ్(హాలీవుడ్ సినిమా)-నవంబర్ 26
టైసన్ ఫ్యూరీ(డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 27
ది చైల్డ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 27
దృశ్యం-3(హిందీ మూవీ)- నవంబర్ 27
ది హంచ్బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్(ఫ్రెంచ్ మూవీ)- నవంబర్ 27
అమెజాన్ ప్రైమ్
క్లాషింగ్ త్రూ ది స్నో (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 23
బ్లేడ్ రన్నర్ 2099 (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25
నైన్ టూ సిక్స్ (కొరియన్ మూవీ)- నవంబర్ 25
సోనిలివ్
హనుమాన్ అంశ్(బాలీవుడ్ మూవీ)- నవంబర్ 27
జియోహాట్‌స్టార్
ది డిగ్-(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 25
స్వీట్ పీ-సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 26
ది స్లైయెస్ట్ టచ్(డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 26
దాయి చాల్(హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 27
ఆపిల్ టీవీ ప్లస్
వే ఆఫ్ ది వారియర్ కిడ్-(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25
Tags : 1