Breaking News

బెట్‌ ఇలాంటి ‘వార్‌’ చూసి ఉండరు: ఎన్టీఆర్‌

Published on Thu, 06/26/2025 - 13:55

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్‌. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ నిర్మించిన స్పై యాక్షన్‌ మూవీ ‘వార్‌’ (2019) కొనసాగింపుగా వార్‌ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్‌ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.

ఈ పోస్టర్లను ఎన్టీఆర్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ.. ‘బెట్‌ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్‌’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్‌ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం  ఎన్టీఆర్‌ ముంబైకి వెళ్లారు.

కూలీతో పోటీ
ఆగస్ట్‌ 14న వార్‌ 2 తో పాటు మరో భారీ పాన్‌ ఇండియా చిత్రం కూడా రిలీజ్‌ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్‌ మేనియా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్‌ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్‌ వార్‌లో గెలిదెవరో చూడాలి. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)