Breaking News

షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!

Published on Fri, 08/18/2023 - 18:54

ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొవిడ్ నాటి పరిస్థితుల నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్‌ ఖాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  బాలీవుడ్‌లో అతను చేసే పాలిటిక్స్ తనకు నచ్చవని విమర్శలు చేశారు. కానీ నేను కూడా షారుక్ అభిమానినే అని ప్రస్తావించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన స్టార్ హీరోపై విమర్శలు చేయడంపై బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. షారూక్ రాజకీయాలు చేయడం వల్ల  బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు.  

(ఇది చదవండి:  రజనీకాంత్‌ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్‌ స్టార్‌)
 
వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..' నేను కూడా షారుక్‌కు అభిమానినే. ఆయనకు చరిష్మా ఉంది. కానీ అతను చేసే రాజకీయాలే నాకు నచ్చవు. ఇలాంటి వారి వల్ల బాలీవుడ్‌కు చెడ్డ పేరు వస్తుంది. అయితే వీళ్లు స్టార్‌డమ్‌ లేకుండా దేన్నీ అంగీకరించరు.  ప్రేక్షకులకు ఏమీ తెలియదని  భావిస్తారు.  నేను కేవలం ప్రజలకు నచ్చే సినిమాలు తీస్తా. కానీ వాళ్లు బాక్సాఫీస్‌ కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తారు. ఏదైనా మూవీ హిట్ అయితే.. అది షారుక్ సక్సెస్ అంటారు. కానీ నా చిత్రాలు హిట్ అయితే ప్రేక్షకుల విజయంగా భావిస్తా. మాది భిన్న వైఖరి అయినప్పటికీ.. షారుక్‌తో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధం.' అని అన్నారు.  మరో వైపు  డైరెక్టర్ కరణ్‌ జోహార్‌పై విమర్శలు చేశారు. 

ముఖ్యంగా స్టార్‌ డమ్‌ను అతిగా కీర్తించడం వెనుక కరణ్ జోహార్ ఉన్నాడని వివేక్ ఆరోపించారు. అతను మధ్యతరగతి నుంచి వచ్చిన ప్రతిభావంతుల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. కరణ్ కేవలం స్టార్ సిస్టమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.  అయితే మరోవైపు షారుక్‌ ఖాన్‌పై కామెంట్స్ చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఈ కామెంట్స్‌కు వ్యతిరేకంగా చాలామంది కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మిస్టర్ కంగనా అంటూ విమర్శలు చేస్తున్నారు.  అగ్నిహోత్రి ఓ మానసిక రోగి అంటూ పోస్టులు పెడుతున్నారు. 

(ఇది చదవండి: మరో హిట్‌కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)