Breaking News

'విష్ణు విన్యాసం' తొలిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Published on Sat, 02/28/2026 - 17:12

సామజవరగమన, సింగిల్ లాంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న హీరో శ్రీ విష్ణు నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'విష్ణు విన్యాసం'. పెద్దగా బజ్ లేకుండానే శుక్రవారం(ఫిబ్రవరి 27) థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచి దీనికి గొప్ప టాక్ అయితే రాలేదు. చూసినవాళ్లు కూడా పెదవి విరుస్తున్నారు. అయితేనేం తొలిరోజు కళ్లుచెదిరే కలెక్షన్స్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. మొదటిరోజు వసూళ్ల పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)

శ్రీ విష్ణు, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని కామెడీ కథతో తీశారు గానీ పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు. కానీ తొలిరోజు రూ.3.95 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ వదిలారు. వీకెండ్ అయ్యేసరికి ఈ మూవీ టా‌క్‌తో పాటు కలెక్షన్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికైతే థియేటర్లలో వేరే మూవీస్ ఏం లేకపోవడం దీనికి కలిసి రావొచ్చు.

'విష్ణు విన్యాసం' విషయానికొస్తే.. విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్‌ లెక్చరర్‌. జాతకాల పిచ్చి ఎక్కువే. వాస్తు బాలేదని పక్కింటి ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటేసినా పెళ్లి చేసుకోడు. ఇతడిని చూసిన తొలిచూపులోనే మరో లెక్చరర్‌ మనీషా(నయన్ సారిక) ప్రేమలో పడుతుంది. ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యే ముందు మనీషా.. ఓ నిజం చెబుతుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషా పెళ్లి చేసుకున్నారా? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)