Breaking News

భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా: మంచు విష్ణు

Published on Sat, 03/15/2025 - 13:33

సాక్షి, రాజంపేట: హీరో మంచు విష్ణు (Vishnu Manchu) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలోని ఊటుకూరు భక్తకన్నప్ప గుడిని శనివారం సందర్శించాడు. కన్నప్ప చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తమ గ్రామానికి విచ్చేసిన విష్ణుకు.. స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

చరిత్ర తెలియజేయాలనే..
ఆలయ దర్శనానంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్తకన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే కన్నప్ప సినిమా (Kannappa Movie) తీశాం. ఏప్రిల్‌ 25న ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది. ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తాను. ఆలయ పెద్దలతో మాట్లాడి గుడికి కావాల్సిన అవసరాలను తీరుస్తాను అని హామీ ఇచ్చాడు.

కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. 
మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. కన్నప్ప పాత్రలో విష్ణు, రుద్రుడిగా ప్రభాస్‌, మహా శివుడిగా అక్షయ్‌ కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్‌ కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.

చదవండి: నితిన్‌ వల్లే ఐటం సాంగ్‌ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)