మర్చిపోయారా? సిక్స్‌ ప్యాక్‌ ట్రెండ్‌ మొదలుపెట్టిందే ఆ హీరో!: విశాల్‌

Published on Fri, 04/25/2025 - 12:18

తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ రెట్రో (Retro Movie). ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌లో అతడి తండ్రి శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ చిత్రపరిశ్రమలో సిక్స్‌ ప్యాక్‌ ట్రెండ్‌ను ప్రవేశపెట్టింది నా కొడుకే అని ఆయన సగర్వంగా చెప్పుకున్నాడు. అంతటితో ఆగకుండా సూర్య కంటే ముందు ఎవరైనా సిక్స్‌ ప్యాక్‌తో రావడం చూశారా? అని ఓ ఈవెంట్‌లో ప్రశ్నించాడు.

సిక్స్‌ ప్యాక్‌ ట్రెండ్‌
ఇది విన్న సినీప్రియులు.. అదేంటి? కోలీవుడ్‌లో అంతకుముందే విశాల్‌ (Vishal) సిక్స్‌ ప్యాక్‌తో వచ్చాడుగా అని కామెంట్లు చేస్తున్నారు. అసలు సిక్స్‌ప్యాక్‌ ట్రెండ్‌కు కోలీవుడ్‌లో నాంది పలికింది ఎవరన్న ప్రశ్నకు తాజాగా విశాల్‌ స్పందించాడు. మొదట్టమొదటిసారి ధనుష్‌ పొల్లాధవన్‌ మూవీలో సిక్స్‌ ప్యాక్‌తో కనిపించాడు. తర్వాత నేను సత్యం, మదగజరాజ సినిమాల్లో సిక్స్‌ ప్యాక్‌ చూపించాను. జనాలు ఇవన్నీ మర్చిపోయారనుకుంటాను అని చెప్పుకొచ్చాడు.

మర్చిపోయారా?
వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన 'పొల్లాధవన్‌' 2007లో రిలీజైంది. ఇందులో ధనుష్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించాడు. తర్వాత విశాల్‌ 'సత్యం' సినిమాలో ఆరుఫలకల దేహంతో కనిపించాడు. ఈ మూవీ 2008 ఆగస్టులో విడుదలైంది.  అనంతరం సూర్య.. 2008 నవంబర్‌లో వచ్చిన 'వారణం ఆయిరం' (సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌) సినిమాలో తొలిసారి సిక్స్‌ప్యాక్‌ ట్రై చేశాడు. ఇక రెట్రో విషయానికి వస్తే.. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్‌ చేసింది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ  మే 1 న విడుదల కానుంది.

చదవండి: అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)