Breaking News

ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం'

Published on Tue, 06/17/2025 - 17:42

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ వస్తూనే ఉంటుంది. గతవారం అలా 30కి పైగా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఈ వారం కూడా పలు తెలుగు స్ట్రెయిట్ మూవీస్, డబ్బింగ్ చిత్రాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటి సంగతి అలా పక్కనబెడితే ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ ప్రకటించడంతో స్ట్రీమింగ్ తేదీని కూడా ఖరారు చేశారు.

(ఇదీ చదవండి: కీర్తి సురేశ్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌)

యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్‌గా నటిస్తున్న ఈ థ్రిల్లర్‪‌కి 'విరాటపాలెం' అనే టైటిల్ నిర్ణయించారు. ఇది వెబ్ సిరీస్‌గా రాబోతుంది. పొల్లూరు కృష్ణ దర్శకుడు. జూన్ 27న అంటే వచ్చే వారం నుంచి ఇది జీ5లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. ఫస్ట్ లుక్ బట్టి చూస్తే ప్రధాన పాత్రధారి కానిస్టేబుల్, వెనక చాలామంది కొత్త పెళ్లి కూతుళ్లు, ఆ వెనక అమ్మవారి విగ్రహం ఉంది. చూస్తుంటే ఆసక్తికరంగానే ఉంది.

1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజే మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం లాంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఓ పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. గ్రౌండ్ జీరో, డిటెక్టివ్ షెర్డిల్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ లాంటి పరభాషా సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్, ద గ్రేట్ ఇండియన్ కపిల్ కామెడీ షో ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతానికైతే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఏం లేవు.. వారాంతంలో సడన్ సర్‌ప్రైజులు ఉండొచ్చు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)