Breaking News

స్టార్ హీరో డ్రగ్స్ మత్తు.. నటిపై అసభ్యకర కామెంట్స్

Published on Wed, 04/16/2025 - 11:50

సినిమా ఇండస్ట్రీలో వివాదాలు, ఆరోపణలు కొత్తేం కాదు. పలువురు యాక్టర్స్ వల్ల తోటి నటీనటులు ఇబ‍్బంది పడిన సందర్బాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఎవరో ఒకరు వాటిని  బయటపెడితే గానీ అసలు సంగతి తెలియదు. తాజాగా ఓ మలయాళ నటి.. ఓ హీరో డ్రగ్స్ తీసుకుని మరీ షూటింగ్ లో పాల్గొంటున్నాడనే విషయాన్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: 'పెద్ది' కోసం తెలుగు ట్రైనింగ్.. వర్షం పడింది) 

పలు మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విన్సీ సోనీ.. ఈ మధ్య కాలంలో తాను నటిస్తున్న ఓ మూవీ సెట్ లో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ అగ్ర హీరో తనని ఇబ్బంది పెట్టాడని స్వయంగా ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసింది.

'ఈ మధ్య ఓ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో నా డ్రస్సు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయాన్ని ఆ మూవీ హీరో నాతో చెప్పాడు. సరే మార్చుకుంటాలే అని క్యారవ్యాన్ వైపు వెళ్తుండగా.. తను కూడా నాతో పాటు వస్తానని అందరి ముందు అన్నాడు'

(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?) 

'మరోసారి ఓ సీన్ షూట్ చేస్తున్న టైంలో సదరు హీరో నోటి నుంచి తెల్లని పదార్థం ఒకటి అనుకోకుండా బయటపడింది. అది డ్రగ్స్ కాక ఇంకేం అయ్యింటుంది. అప్పటినుంచి డ్రగ్స్ అలవాటు ఉన్నవారితో నటించకూడదని నిర్ణయించుకున్నాను. చెప్పాలంటే ఆ రోజు సెట్ లో జరిగింది అసహ్యకరమైన అనుభవం' అని విన్సీ తన వీడియోలో చెప్పుకొచ్చింది.

2019లో వికృతి సినిమాతో నటిగా మారిన విన్సీ.. తర్వాత రేఖ, జనగణమన, సౌదీ వెళ్లక్క, పద్మిని, పళజన్ ప్రణయం తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హీరో పేరు చెప్పకుండా తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది.

(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. ‍అయినా బాధ లేదు) 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)