Breaking News

పర్సనల్‌ లైఫ్ జడ్జ్‌ చేయడానికి మీరెవరు?.. విజయ్- త్రిష వివాదంపై స్టార్ డైరెక్టర్

Published on Tue, 03/10/2026 - 12:52

కోలీవుడ్‌లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.

తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్‌గా మారింది..

విక్రమ్ భట్ తన పోస్ట్‌లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో వస్తోన్న రూమర్స్‌ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు.  ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్‌ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్‌ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.

కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్‌ కేసు విషయంలో విక్రమ్‌ భట్‌ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్‌, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)