Breaking News

అడుక్కుంటున్నా పట్టించుకోవట్లే.. హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌

Published on Sat, 02/14/2026 - 16:13

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత విక్రమ్‌ భట్‌ ఆర్థిక మోసం కేసులో చిక్కుకున్నాడు. దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రమ్‌ దంపతులను పోలీసులు ఇటీవలే అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో విక్రమ్‌, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ ఏమందంటే?
ఇదే సమయంలో పలువురు ఆర్టిస్టులు విక్రమ్‌ తమకు సరిగా జీతాలివ్వలేదని ముందుకొస్తున్నారు. 2023లో వచ్చిన 1920: హారర్స్‌ ఆఫ్‌ ద హార్ట్‌, ఖిలోనా (ఇది మధ్యలోనే ఆగిపోయింది) సినిమాలకు టెక్నీషియన్లకు డబ్బు చెల్లించలేదని పలువురు మీడియా ముందుకొచ్చారు. తాజాగా హీరోయిన్‌ అవికాగోర్‌కు మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసిన స్నేహ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.

స్పందన లేదు
మిడ్‌డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ శర్మ మాట్లాడుతూ.. 1920: హారర్స్‌ ఆఫ్‌ ద హార్ట్‌ సినిమాకు పని చేసిన చాలామందికి పూర్తి వేతనాలు చెల్లించలేదు. మా జీతాలు మాకు చెల్లించమని అడుక్కుంటున్నాం.. కానీ విక్రమ్‌ భట్‌ టీమ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఒక హెయిర్‌స్టైలిస్ట్‌కి అయితే ఇంటి అద్దె కట్టకపోవడంతో అతడిని ఇంటినుంచి గెంటేసే పరిస్థితి వచ్చింది. మొదట్లో మాకు సమయానికి డబ్బు చెల్లించారు.

సగమే ఇచ్చి..
కానీ రెండో షెడ్యూల్‌కు వచ్చేసరికి నిధులు లేవన్నారు. ఓపక్క డబ్బు లేదంటూనే మరో పక్క కొత్త సినిమాను కూడా మొదలుపెట్టారు. 1920 మూవీ కోసం నాకు రోజుకు రూ.18 వేల లెక్కన డీల్‌ మాట్లాడుకున్నాను. అయితే అందులో నాకు సగమే ఇచ్చారు. విక్రమ్‌ భట్‌ కూతురు కృష్ణ భట్‌ను అడిగితే ఆ లెక్కలేవీ తనకు తెలియదంది. పైగా మరికొన్ని రోజులు ఉచితంగా పని చేయమని కోరింది.

పైసా ఇవ్వడు
డబ్బు ఇవ్వకపోతే నేనెందుకు పని చేస్తానని కరాఖండిగా రానని చెప్పేశాను. దాంతో మరో మేకప్‌ ఆర్టిస్ట్‌తో ఉచితంగా పని చేయించుకున్నారు అని చెప్పుకొచ్చింది. విక్రమ్‌ భట్‌ మనమంతా ఒకే కుటుంబం అని సెంటిమెంట్‌ డైలాగ్‌ చెప్పి అందరితో ఇలాగే పని చేయించుకుంటాడని, డబ్బు మాత్రం సరిగా ఇవ్వడని పలువురు సిబ్బంది వాపోయారు. కొందరికైతే లక్షలు ముట్టాల్సింది ఉందని, అవేవీ ఇవ్వకుండా మోసం చేశాడంటున్నారు.

చదవండి: సూర్య -జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు: హీరో తండ్రి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)