విజయ్ కచేరి సాంగ్‌.. ఫేక్ వ్యూస్‌పై స్పందించిన యూట్యూబ్!

Published on Thu, 11/13/2025 - 17:56

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటేస్ట్‌ మూవీ'జన నాయగణ్‍'. పొలిటిక్స్‌లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ కెరీర్‌లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'దళపతి కచేరీ' అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో ఏకంగా 44 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో ఇవన్నీ ఫేక్ వ్యూస్‌ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాట్స్ ద్వారా ఈ వ్యూస్ వచ్చాయని కొందరు నెటిజన్స్‌ ఆరోపించారు. రిలీజైన గంటలోనే ఏకంగా 3 మిలియన్స్‌ వ్యూస్ అంటూ ఓ నెటిజన్‌ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు వ్యూస్‌ పెంచుకునేందుకు బాట్స్ ఉపయోగపడ్డాయా అంటూ ట్రోల్ చేశారు.

కచేరీ సాంగ్‌పై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ కూడా స్పందించింది. ఇలాంటి వాటిని గుర్తించడానికి(లైక్‌లు, వ్యూస్) తమ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉందని యూట్యూబ్ తెలిపింది. అవీ ఒరిజినల్‌ లేదా ఫేక్ అని ధృవీకరించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా ఉందని పేర్కొంది. 

కాగా.. దళపతి కచేరి' పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించగా.. అనిరుధ్, అరివు, విజయ్ ఆలపించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

Videos

Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

Ambati: ధర్మారెడ్డి విచారణపై ABN, TV5 పిచ్చి వార్తలు...

Global Silence: 8 లక్షల మంది బలి

Nidadavolu: టీడీపీ బెల్ట్ షాపుల దందా.. బాటిల్‌పై అదనంగా రూ.30 వసూలు

ReNew సంస్థను రాష్ట్రం నుంచి పంపేసారంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు

విజయవాడలో నడిరోడ్డుపై దారుణహత్య

అంకాలమ్మ గూడూరు గ్రామ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: వైఎస్ అవినాష్

Sudha Madhavi: నన్ను బెదిరించి వీడియో రికార్డు చేశారు..!

తిరుపతిలో ప్రజా ఉద్యమం చూసి బిత్తరపోయిన పోలీసులు

పవన్ కల్యాణ్‌కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్‌.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)

+5

ఫ్రెషర్స్‌ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)