Breaking News

ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్‌ హిట్‌ మూవీ.. ఎప్పుడంటే?

Published on Mon, 07/08/2024 - 10:45

కంటెంట్‌ బాగుంటే ప్రచారాలు, ఆర్భాటాలు ఏవీ అవసరం లేదు. మౌత్‌ టాక్‌తోనే హిట్‌ సాధించేస్తాయి. అలా విజయ్‌ సేతుపతి నటించిన మహారాజ మూవీ కూడా పెద్దగా ప్రమోషన్స్‌ చేయకుండా థియేటర్లలో విడుదల చేశారు. ఆశ్చర్యంగా పాజిటివ్‌ టాక్‌తో రోజురోజుకూ కలెక్షన్స్‌ ఎక్కువయ్యాయి. అలా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

ఓటీటీలో..
నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 14న తెలుగులో విడుదలైంది. ఇందులో మమతా మోహన్‌దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రలు పోషించారు. అజనీష్‌ లోకనాథ్‌ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ శుక్రవారం (జూలై) 12 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్‌ అవుతుందని పేర్కొన్నారు. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ఈ మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నామని ఓటీటీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!

కథేంటంటే?
మహారాజ (విజయ్‌ సేతుపతి) ఓ బార్బర్‌. ఓ రోజు యాక్సిడెంట్‌లో తన భార్య చనిపోగా ఓ ఇనుప చెత్త డబ్బా వల్ల కూతురు ప్రాణాలతో బయటపడుతుంది. ఆ చెత్త డబ్బాకు లక్ష్మి అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటాడు. ఓ రోజు లక్ష్మి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. తర్వాత ఏమైంది? లక్ష్మి దొరికిందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!

 

 

 

చదవండి: రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)