Breaking News

'బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్'.. నిజంగా అంత బాగుందా?

Published on Tue, 10/06/2026 - 12:06

సినిమాకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ఏ భాషా చిత్రమైనా సరే చూసే ప్రేక్షకులు బోలెడుమంది. ఇప్పుడు అలా తెలుగు ఆడియెన్స్ మధ్య చర్చకు కారణమైంది 'బత్తా'. విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర చేసిన ఈ తమిళ సినిమా.. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరి నుంచి బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ ఏడాది రిలీజైన అత్యుత్తమ చిత్రమని తెగ పొగిడేస్తున్నారు. మరి అంతలా ఇందులో ఏముంది? అసలు కథేంటి?

విజయ్ సేతుపతి.. ఓ లవ్‌లీ క్యూట్ గ్యాంగ్‌స్టర్‌గా చేసిన సినిమా 'బత్తా'. సేతుపతి పాత్ర పేరునే టైటిల్‌గా పెట్టారు. గ్యాంగ్‌స్టర్ అన్నాం కదా అని కత్తులు, నరుక్కోవడాలు ఉంటాయని అనుకోవద్దు. పూర్తిగా కామెడీ, ఎమోషనల్‌గా దీనిని తీశారు. బత్తా అనే గ్యాంగ్‌స్టర్‌ని ఓ పిల్లాడు.. స్కూల్‌లోని ఓ బాత్రూంలో పెట్టి బంధిస్తే తర్వాత ఏమైంది? బత్తాలో ఎలాంటి మార్పొచ్చింది? అనేది మిగతా స్టోరీ.

విజయ్ సేతుపతి ఇప్పటికే పలు సినిమాల్లో అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు. కానీ 'బత్తా'లో ఎప్పటికీ గుర్తుండిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. సేతుపతే అనుకుంటే శబరి పాత్ర చేసిన పిల్లాడైతే ఆశ్చర్యపోయేంత షాకింగ్‌గా నటించాడు. వీళ్లిద్దరే కాదు సేతుపతి భార్యగా చేసిన లిజోమోల్, కూతురిగా చేసిన పాప కూడా అదరగొట్టేశారు.

ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అపూర్వకి ఇచ్చిపడేశారు.. నామినేషన్లలో రచ్చ

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. తమకు పూర్తిగా సంతృప్తి చెందామని చెబుతున్నారు. అదే టైంలో ఈ ఏడాది తాము చూసిన అత్యుత్తమ చిత్రం ఇదేనని కూడా అంటున్నారు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకు చాలా అంటే చాలా ప్లస్ అయిందని చెబుతున్నారు. దర్శకుడు బాలాజీ ధరణిధరన్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువేని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ లాంటి చోట్ల 'బత్తా' సినిమా ప్రదర్శితమవుతున్నప్పటికీ ప్రస్తుతం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ చేస్తే అస్సలు మిస్ కావొద్దు! 

ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన

sss

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)