Breaking News

'96' సినిమా సీక్వెల్‌.. సింగపూర్‌, మలేషియా నుంచి కథ

Published on Tue, 12/31/2024 - 13:19

ప్రస్థుతం చిత్రపరిశ్రమలో సీక్వెల్‌ నడుస్తోందని చెప్పవచ్చు. అయితే అన్ని చిత్రాల సీక్వెల్స్‌ హిట్‌ అవుతాయని గ్యారంటీ లేదు. బాహుబలి,పుష్ప వంటి కొన్ని చిత్రాల సీక్వెల్స్‌ మాత్రమే విజయం సాధించాయి. ఇండియన్‌–2, విడుదల-2  వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు పొందలేక పోయాయి. కాగా 2018లో తమిళ్‌లో విడుదలైన 96 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. 

ఇది పాఠశాల ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. విదేశాల్లో ఉన్న త్రిష పాఠశాల స్నేహితులను కలవడానికి చైన్నెకి వస్తుంది. అప్పుడు తన చిన్ననాటి ప్రేమికుడు కూడా విజయ్‌సేతుపతి కూడా వస్తాడు. వారి మధ్య జరిగే మూగ ప్రేమే 96 చిత్ర కథ. కాగా ఏడేళ్ల తర్వాత ఈ చిత్ర సీక్వెల్‌కు దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ సిద్ధం అవుతున్నారు. ఈయన ఇటీవల కార్తీ, అరవింద్‌స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్‌ అయ్యారు. ఈ చిత్రం విడుదల సమయంలోనే 96 చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని చెప్పారు. 

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్ర కథ సింగపూర్‌, మలేషియాల్లో జరిగే విధంగా ఉంటుందని దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి భాగంలో త్రిష విదేశాల నుంచి చైన్నెకి వచ్చినట్లు చూపించిన విషయం తెలిసిందే. 

దీంతో రెండవ భాగం విదేశాల్లో జరుగుతుందని దర్శకుడు ఈసందర్భంగా చెప్పారు. అదేవిధంగా 96 చిత్ర కథను ప్రేమ ఇతివృత్తంతో రూపొందించగా, దాని సీక్వెల్‌ ప్రేమతో పాటు కుటుంబసమస్యలు, భావోద్రేకాలు వంటి అంశాలతో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)