విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం

Published on Mon, 04/20/2026 - 13:54

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల కేసుని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది. ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా విజయ్ పర్యటిస్తున్నారని, భద్రతా కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల కోర్టుకు రాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వివరించారు. మరోవైపు సంగీత కూడా కోర్టుకు రాలేదు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు విచారణని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)

గతంలోనే ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వాలని విజయ్‌కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కానీ సోమవారం.. ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసి విచారణని వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల అభ్యర్థన మేరకు ఈ విడాకుల కేసు విచారణని జూన్ 15వ తేదీకి వాయిదా వేశారు.

27 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న విజయ్-సంగీత.. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు ఇదివరకే తెలియజేశారు. విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకంపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్, భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన ఒప్పందానికి వచ్చారట. అయితే ఆర్థికపరమైన వివరాలు ఏవి కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పొందుపరచలేదు.

(ఇదీ చదవండి: నేను అడిగాను.. కానీ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదు: 'రాకా' గురించి ఆర్య)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)