Breaking News

జన నాయగన్‌.. మూడు రోజులైనా ఆ మార్క్ దాటలే..!

Published on Sun, 07/26/2026 - 12:35

దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 23న రిలీజైన ఈ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కు దాటిన జన నాయగన్.. మూడో రోజు కూడా అదే జోరు కనిపించింది.

ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్కుకు చేరువగా వచ్చేసింది. ఇప్పటి వరకు వరల్డ్‌ వైడ్‌గా రూ. 171.84 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాకుండా కేవలం ఇండియాలోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగమించింది. అయినప్పటికీ విజయ్  నటించిన 'లియో' (2023), 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (2024) సాధించిన వసూళ్ల కంటే వెనకంజలోనే ఉంది. గతంలో 'లియో' చిత్రం మూడో రోజు ఇండియాలో రూ. 38.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గోట్ మూవీ సైతం రూ. 33.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది.

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ ప్రకారం జన నాయగన్' ఇండియాలో మూడో రోజు రూ. 28.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవర్‌సీస్‌లో మరో రూ. 20 కోట్లను రాబట్టింది. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 108.34 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. రూ. 92.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. విదేశాల్లో రూ. 63.50 కోట్ల  గ్రాస్ వసూళ్లు రాగా.. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా రూ. 171.84 కోట్లకు చేరుకున్నాయి.

కాగా.. ఈ చిత్రంలో విజయ్ 'వెట్రి కొండన్' అనే మాజీ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఆయన తన దత్తపుత్రికగా 'విజి' పాత్రలో మమితా బైజు కనిపించింది. ఈ మూవీ పూజా హెగ్డే హీరోయిన్‌గా మెప్పించగా.. బాబీ డియోల్  'జాన్ హిమ్లర్' అనే విలన్ పాత్రను పోషించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)