ఫ్యామిలీతో విజయ్ సెలబ్రేషన్స్
Breaking News
తమిళనాడు సీఎంగా విజయ్.. రెండేళ్ల క్రితమే చెప్పేశాడుగా..!
Published on Tue, 05/05/2026 - 15:04
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ విజయకేతనం ఎగరేశాడు. పోటీ చేసిన తొలిసారే అత్యధిక సీట్లు సాధించిన సినీ గ్లామర్ పర్సన్‌గా చరిత్ర సృష్టించాడు. సింగిల్‌గా పోటీ చేసి.. గత 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా మారిన పార్టీలకు చెక్ పెట్టాడు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను ఓడించి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా.. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే వందకు పైగా సీట్లు సాధించి తానేంటో నిరూపించాడు. ఇక మిగిలింది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే.
అయితే విజయ్ సీఎం అవుతాడాని ముందే చాలాసార్లు హింట్ ఇచ్చారు. గతంలో విజయ్ సహనటుడు ప్రేమ్‌జీ అమరన్ కూడా విజయ్ సీఎం అవుతాడని చెప్పారు. 2026లో నేను అతనికే ఓటు వేస్తాను.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని నేను మీకు హామీ ఇస్తున్నానని మాట్లాడారు. అతను అన్నట్లుగానే విజయ్ ఇప్పుడు సీఎం పీఠం ఎక్కనున్నారు.
విజయ్ కూడా ముందే హింట్..
టీవీకే అధినేత, హీరో విజయ్ సైతం తాను సీఎం అవుతానని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరలవుతోంది. తాను హీరోగా నటించిన గోట్ మూవీలో TN 07 CM 2026 అనే నంబర్ ఉన్న కారును నడుపుతూ కనిపించారు. టీఎన్ అంటే తమిళనాడు.. 2026లో సీఎం అంటూ కారు నంబర్‌తోనే ముందే చెప్పేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని విజయ్ ముందే ఫిక్సయ్యారు. తాజా ఎన్నికల్లో అదే చేసి చూపించాడు. ఈ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఆ కారు వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. 108 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ పార్టీకి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి కేవలం 10 స్థానాలు మాత్రమే కావాలి. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. తిరుచ్చి (తూర్పు), పెరంబూరులో గెలిచారు.
TVK formed in Feb 2024
The Greatest of All Time release Sep 2024
Look at the Car number.
TN 07 CM 2026 ❤️❤️❤️
The Election Results came out First in Theatre Screens 🔔
Peak Detailing by @vp_offl Venkat Prabhu in Thalapathy Vijay movie GOAT 🔥🔥🔥#FI pic.twitter.com/Uv5M7RZR5A— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) May 4, 2026
Tags : 1