Breaking News

విరోష్‌... ఓ రికార్డ్‌

Published on Sat, 02/28/2026 - 03:41

బాక్సాఫీస్‌ దగ్గర భారీ సినిమాలు వసూళ్లపరంగా రికార్డ్‌ బ్రేక్‌ చేయడం కామన్‌. అయితే ఇప్పుడు ‘విరోష్‌’ (విజయ్‌ దేవరకొండ–రష్మికా మందన్నా) వివాహం ఓ రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్‌ ప్యాలెస్‌ వేదికగా ఉయం 10 గంటల 10 నిమిషాలకు విరోష్‌  వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఫొటోలను ‘విరోష్‌’ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసి, ఒకరిçపట్ల మరొకరికి ఉన్న ప్రేమను చెబుతూ, ఓ పోస్ట్‌ని కూడా షేర్‌ చేశారు. కాగా... రష్మికా మందన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోలకు అత్యధిక లైక్స్‌ దక్కాయి. 

దీంతో ‘విరోష్‌’ వివాహ ఫొటోలు రికార్డ్‌ సాధించాయి. బాలీవుడ్‌ కపుల్‌ పిద్ధార్థ్‌ మల్హోత్రా–కియారా అద్వానీల పెళ్లి ఫొటోలు అత్యధిక లైక్స్‌ దక్కించుకున్న రికార్డ్‌ని సొంతం చేసుకున్నాయి. ఆ రికార్డ్‌ని తాజాగా విరోష్‌ ఫొటోలు బ్రేక్‌ చేశాయి. షేర్‌ చేసిన తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్‌ (15.8 మిలియన్లు) సాధించిన సిద్ధార్థ్‌–కియారాల రికార్డ్‌ని 18.5 మిలియన్ల లైక్స్‌తో ‘విరోష్‌’ పెళ్లి ఫొటోలు బ్రేక్‌ చేశాయి. ఈ నంబర్‌ ఇంతటితో ఆగలేదు... లైక్స్‌ సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటుతున్న సమయంలో ఈ సంఖ్య 20 మిలియన్లకు పైగా దాటింది. అంటే... దాదాపు రెండు కోట్లకు పైనే లైక్స్‌ దక్కాయి. దీన్నిబట్టి విజయ్‌–రష్మికల జోడీకి ఎంత క్రేజ్‌ ఉందో ఊహించుకోవచ్చు.

ఉదయ్‌పూర్‌ టు హైదరాబాద్‌: పెళ్లి ఫొటోల్లో బ్యూటిఫుల్‌ కపుల్‌లా కనిపించిన విజయ్‌–రష్మిక శుక్రవారం ఎయిర్‌పోర్టులో క్యూట్‌గా కనిపించి, ఆకట్టుకున్నారు. శుక్రవారం ఈ నూతన జంట హైదరాబాద్‌ చేరుకుంది. కాగా ఎయిర్‌పోర్టులో ఈ జంటని చూసి, ‘కంగ్రాచ్యులేషన్స్‌’ అంటూ ఫ్యాన్స్‌ అభిమానం చాటుకోగా... ‘విరోష్‌’ శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు ఫ్లయింగ్‌ కిస్‌లు ఇస్తూ... చిరునవ్వులు చిందించారు. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది.    

ప్రధానికి ఆహ్వానం... వైరల్‌
భారత ప్రధాని నరేంద్ర మోదీని గత వారం విజయ్‌–రష్మిక స్వయంగా కలిసి, తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ జంటను ఆశీర్వదిస్తూ... మోదీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా... మోదీని విజయ్‌–రష్మిక కలిసిన ఫొటోలు తాజాగా బయటకు రాగా... అవి కూడా వైరల్‌గా మారాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)