Breaking News

లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ

Published on Sat, 08/08/2026 - 16:10

ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు నచ్చలేదని అంటున్నారు. దీనితో పాటే 'డిసి' అనే తమిళ డబ్బింగ్ బొమ్మ కూడా రిలీజైంది. ఇందులో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ హీరోగా నటించగా.. అనిరుధ్ సంగీతమందించాడు. రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టోరీతో దీన్ని తీశారు. దీనికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ఈ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సింది. ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)

'తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ నా దగ్గరకు ఓ ఆసక్తికరమైన కథతో వచ్చాడు. నాకు చెప్పాడు. అదే టైంలో నేను చేస్తున్న ఓ సినిమా స్టోరీ.. దీనికి పోలినట్లు ఉండటంతో నేను అది ఓకే చేయలేకపోయాను' అని స్వయంగా విజయ్ దేవరకొండ చెప్పిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ వీడియో బట్టి చూస్తే విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా చేస్తున్న టైంలో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ 'డిసి' కథతో విజయ్‌ని కలిశాడు. కానీ సెట్ కాలేదు. దీంతో హీరోగా లోకేశ్ కనగరాజ్‌ని తీసుకున్నారు. అలా రౌడీ హీరో చేయాల్సిన మూవీతో దర్శకుడు లోకేశ్ హీరోగా మారాడు. నటుడిగా తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నాడు. ఒకవేళ విజయ్ దేవరకొండ 'డిసి' చేసుంటే ఎలా ఉండేదో?

ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలతో బిజీగా ఉండగా.. లోకేశ్ కనగరాజ్, అల్లు అర్జున్‌తో తాను తీయాల్సిన #AA23 ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

(ఇదీ చదవండి: లోకేశ్‌ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) 

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)