Breaking News

విరోష్ జంట రణబాలి.. యాక్షన్‌ ట్రైలర్ వచ్చేసింది

Published on Thu, 10/08/2026 - 18:11

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాన్ని రాయలసీమలో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్లలో భాగంగా రణబాలి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ ట్రైలర్ చూస్తుంటే రాయలసీమలో బ్రిటీష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల పాటు కరువు రావడంతో దాదాపు కోటిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజుల్లో బ్రిటీశ్‌ పాలకులు చేసిన దురాగతాలకు వ్యతిరేకంగా రణబాలి చేసే పోరాటం ట్రైలర్‌లో కనిపిస్తోంది. బ్రిటీశ్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన వీరుడి కథే రణబాలి అని అర్థమవుతోంది. ఈ ఫుల్ యాక్షన్‌ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.

ఇక ‘రణబాలి’ సినిమా విషయానికొస్తే.. సినిమా నేపథ్యం, కథ ఎలా ఉండబోతుందనే విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిత్రబృందం ఇప్పటికే నాలుగు భాగాలుగా డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసింది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్‌, అతుల్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నిర్మించారు. 
 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)