Breaking News

కింగ్డమ్‌ తొలిరోజు కలెక్షన్స్‌.. విజయ్‌ దేవరకొండ మాస్‌ కమ్‌బ్యాక్‌

Published on Fri, 08/01/2025 - 12:54

హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కోటి ఆశలు పెట్టుకున్న కింగ్డమ్‌ మూవీ (Kingdom Movie) జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొంత నెగెటివ్‌ టాక్‌ ఉన్నప్పటికీ పాజిటివ్‌ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఫస్ట్‌ రోజు కలెక్షన్స్‌ ఎంతన్నదానిపై అందరి దృష్టి పడింది. కానీ, ఎవరి లెక్కలకు అందనంతంగా భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. కింగ్డమ్‌.. తొలి రోజు ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.

హిట్టు కొట్టినం
ఈ మేరకు చిత్రయూనిట్‌ అధికారికంగా పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌ను రౌడీ హీరో షేర్‌ చేస్తూ మనం (హిట్‌) కొట్టినం అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌..! ఇకపోతే కింగ్డమ్‌ వీకెండ్‌లో రాలేదు, అందులోనూ హాలీడే అసలే లేదు. అయినా ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ రావడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. లైగర్‌ మూవీ వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలన్నారు.. అప్పుడు ఎత్తిన నోళ్లు దించుకునేలా మా హీరో కింగ్డమ్‌తో సమాధానం చెప్పాడని సంతోషపడుతున్నారు.

ఆ సినిమాలతోనే పోటీ
అయితే ఈ చిత్రానికి.. మహావతార్‌ నరసింహ, సయారా చిత్రాల నుంచి గట్టి పోటీనే ఉంది. హరిహర వీరమల్లును జనాలు ఎలాగో లైట్‌ తీసుకున్నారు కాబట్టి ఇదేమంత పోటీ కాదు. మున్ముందు కింగ్డమ్‌ ఎన్ని బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్‌ చేస్తుందో చూడాలి! కింగ్డమ్‌ సినిమా విషయానికి వస్తే.. విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్‌, వెంకటేశ్‌, కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు.

 

చదవండి: రెమ్యునరేషన్‌ విషయంలో అజిత్‌ సరికొత్త ఢీల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)