నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సేవలో విజయ్-రష్మిక
Published on Sat, 10/17/2026 - 18:09
'రణబాలి' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విజయ్ దేవరకొండ-రష్మిక అలరిస్తున్నారు. ఇక రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో చెప్పినట్లే ప్రేక్షకుల్ని కలిసేందుకు వస్తామని విజయ్ అన్నాడు. ఇప్పుడు తొలుత విజయవాడ వచ్చాడు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మని భార్య రష్మికతో కలిసి దర్శించుకున్నాడు.
(ఇదీ చదవండి: 'జైలర్ 2' సినిమాలో షో స్టీలర్.. ఎవరీ మూర్తి?)
దర్శనానంతరం మాట్లాడుతూ.. 'అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా 'రణబాలి'ని మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడికి వచ్చాం. అందరికీ దసరా శుభాకాంక్షలు' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన 'రణబాలి' సినిమాలో బ్రిటీషర్లని ఎదురించిన రాయలసీమ వీరుడు సింగనమల రణబాలి జీవితాన్ని చూపించారు.
(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)
(ఇదీ చదవండి: ‘రణబాలి’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?)
The #Ranabaali pair at the Kanaka Durga Temple in Vijayawada ✨ Book your tickets now! 🎟️ https://t.co/ux77cy5vha #Ranabaali #ConqueringCinemas https://t.co/PrQwc17OmM
— RANABAALI (@RanabaaliFilm) October 17, 2026
Tags : 1