Breaking News

పహల్గామ్‌ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!

Published on Tue, 04/29/2025 - 17:00

పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్‌పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు.  తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.

కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్‌లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ  బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది ఇండియన్స్‌ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.

తాజాగా తన పోస్ట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్‌లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే  చివరిసారిగా 'హిట్లర్‌లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
 

 

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)