Breaking News

నటుడు విక్రమ్‌ గోఖలే చనిపోయారంటూ వార్తలు.. స్పందించిన కుటుంబం

Published on Thu, 11/24/2022 - 09:01

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు విక్రమ్‌ గోఖలే మృతిచెందినట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో​ ఆయన కుటుంబం స్పందించింది. గోఖలే ఇంకా బతికే ఉన్నారని, అయితే పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. విక్రమ్‌ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. నిన్న సాయంత్రం కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు.

డాక్టర్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన కోసం ప్రార్థించండి అంటూ అని గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. అయితే అప్పటికే మీడియాలో, వెబ్‌సైట్లలో గోఖలే చనిపోయారంటూ వార్తలు వచ్చాయి.

బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు కూడా ట్విట్టర్‌ ద్వారా సంతాపం కూడా తెలిపారు. ఈ క్రమంలో గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్‌లో 'భూల్ భులయ్యా', 'దిల్ సే','దే దానా దాన్', 'హిచ్కీ', 'నికమ్మ', 'మిషన్ మంగళ్' వంటి బాలీవుడ్ హిట్‌ సినిమాల్లో ఆయన కనిపించారు. 

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)