Breaking News

సిద్ధ వైద్యం వల్లే ప్రముఖ నటుడు మృతి?

Published on Mon, 06/09/2025 - 13:02

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజేశ్‌ (Tamil actor Rajesh) (75) ఇటీవలే కన్నుమూశారు. మే 29న ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే మరణించారు. చలనచిత్రపరిశ్రమలో 50 ఏళ్లకు పైగా రాణించిన ఆయన ఎప్పటికైనా ఓ సినిమా డైరెక్ట్‌ చేయాలని కల కన్నాడు. కానీ, అది నెరవరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే అధునాతన వైద్యాన్ని కాదని సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే రాజేశ్‌ చనిపోయాడని ప్రచారం జరిగింది. 

సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే?
ఆస్పత్రిలో చేరడానికి ముందు సిద్ధ వైద్యుడితో నటుడు గంటల తరబడి గడిపాడని రాజేశ్‌ సోదరుడు చేసిన కామెంట్లతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంపై నటుడు రాజేశ్‌ కూతురు దివ్య స్పందించింది. మా నాన్న ట్రీట్‌మెంట్‌ గురించి తప్పుడు ప్రచారం చేయడం ఇంతటితో ఆపండి. ఈ వదంతులు మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి. దయచేసి ఈ సమయంలో మా కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలేయండి.

నిజమెంత?
మా నాన్న సిద్ధ వైద్యమే కావాలని.. మరొకటి వద్దని మొండిగా వ్యవహరించాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. కాకపోతే ఓ సిద్ధ వైద్యుడు మా నాన్నను రెగ్యులర్‌గా చెక్‌ చేస్తుండేవాడు. ఆరోజు నాన్న శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని సిద్ధ వైద్యుడే గమనించి చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ దారిలోనే కన్నుమూశాడు. దయచేసి ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలుసుకుని మాట్లాడండి అని చెప్పుకొచ్చింది.

ఎవరీ రాజేశ్‌?
రాజేశ్‌ తమిళనాడు వాసి. దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో రాజేశ్‌ సినీప్రస్థానం మొదలైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు, రుద్రుడు సినిమాల్లో నటించారు. హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్‌ వరకు వివిధ పాత్రలు పోషించారు . 1985లో సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా గుర్తింపు పొందారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా అలరించారు. కార్తిగై దీపం సీరియల్‌లో యాక్ట్‌ చేశారు. ఈయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా! 

చదవండి: అఖిల్‌ రిసెప్షన్‌లో సింపుల్‌గా మహేశ్‌.. ఆ టీ షర్ట్‌ ధర లక్షల్లో..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)