Breaking News

హిట్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకొన్న వెంకటేశ్?

Published on Tue, 02/24/2026 - 21:12

హీరో వెంకటేశ్ పేరు చెప్పగానే చాలా రీమేక్స్ గుర్తొస్తాయి. 'దృశ్యం' వాటిలో ఒకటి. గత కొన్నాళ్ల ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలతో చాలామంది ఆడియెన్స్‌కి దగ్గరయ్యారు. రాంబాబు పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే మూడో పార్ట్ నుంచి వెంకీ సైడ్ అయ్యాడనే రూమర్స్ ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమని కూడా అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

మలయాళంలో తొలుత మోహన్ లాల్ హీరోగా 'దృశ్యం' సినిమా వచ్చింది. థ్రిల్లర్ జానర్‌లో సరికొత్త సెన్సేషన్ సృష్టించింది. దీన్ని తెలుగు, తమిళ, హిందీతో పాటు చాలా భాషల్లో రీమేక్ చేశారు. ఆయా భాషల్లోనూ హిట్ అయింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించాడు. గతేడాది జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మూడో భాగాన్ని మొదలుపెట్టారు. కొన్నాళ్ల క్రితం పూర్తి చేశారు. ఈ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్నట్లు అధికారికంగానూ ప్రకటించారు.

(ఇదీ చదవండి: తమిళ బోల్ట్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)

మలయాళంతో పాటు హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా 'దృశ్యం 3' కూడా రెడీ అయిపోతోంది. ఈ ఏడాదిలోనే హిందీ వెర్షన్ కూడా థియేటర్లలోకి రానుంది. కానీ తెలుగులో మాత్రం ఎలాంటి సౌండ్ లేదు. దీంతో అసలు తీస్తారా లేదా అనే సందేహాలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. మూడో పార్ట్ నుంచి వెంకీ తప్పుకొన్నారట. రెమ్యునరేషన్ విషయమే కారణమని అంటున్నారు. ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' చేస్తున్న వెంకటేశ్.. దీని తర్వాత అనిల్ రావిపూడితో కలిసి మరోసారి పనిచేయబోతున్నారనే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ 'దృశ్యం 3' చేస్తే అప్పటికే మలయాళ, హిందీ వెర్షన్స్ థియేటర్లలో రిలీజై, ఓటీటీలోకి కూడా వచ్చేస్తాయి. భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియెన్స్ చూసే అవకాశాలే ఎక్కువ. ఈ కారణం కూడా వెంకటేశ్ తప్పుకోవడానికి కారణమయ్యుండొచ్చని అంటున్నారు.

(ఇదీ చదవండి: వైరల్ అయిపోతున్న 'ఆయా షేర్' పాట రిలీజ్)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)