Breaking News

సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్

Published on Wed, 01/15/2025 - 11:53

వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 'పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)

'సంక్రాంతికి వస్తున్నాం' కథేంటంటే..

డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్‌ వైడీ రాజు(వెంకటేశ్‌) ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. మంచి కోసం తాను చేసే ఎన్‌కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్‌ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్‌), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.

కట్‌ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్‌)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్‌(నరేశ్‌). పార్టీ ప్రెసిడెంట్‌(వీటీ గణేశ్‌) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్‌ హౌజ్‌ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్‌ అతన్ని కిడ్నాప్‌ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్‌.. ఎలాగైనా బీజూ గ్యాంగ్‌ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.

ఐపీఎస్‌ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్‌ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్‌ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్‌ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్‌ ఎలా సక్సెస్‌ చేశాడనేదే ఈ సినిమా కథ. 

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు