Breaking News

వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

Published on Sat, 05/31/2025 - 12:42

మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే గత వారం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు వారం తిరగకుండానే స్ట్రీమింగ్ అయిపోతోంది. ఈ వీకెండ్‌లో 30కి పైగా చిత్రాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాగా.. ఇప్పుడు ఈ లిస్టులో ఈ మూవీ కూడా చేరింది. రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.

రుద్ర వీరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'వీరరాజు 1991'. అర్జన, అజయ్ ఘోష్, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 22న థియేటర్లలో మూవీ రిలీజ్ కాగా.. అక్కడికి వారం తర్వాత అంటే మే 30న ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. రెండు గంటల కంటే తక్కువ నిడివితో ఉన్న ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతంలో జరిగే ఓ కథతో తీశారు. థియేటర్లలో అనుకున్నంత రీచ్ లేకపోవడంతో త్వరగానే ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

ఈ సినిమాలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రుద్ర వీరాజ్‌ది ఆదోని. ఇక మూవీ విషయానికొస్తే.. నెల్లూరు కృష్ణలంకలో చేపలు పట్టే వీరరాజు.. అదే ఊరిలోని అన్యాయాలు చేస్తున్న రాజకీయ నాయకుడికి ఎదురుతిరుగుతాడు. చివరకు ఏమైంది? వీరరాజు ఏం చేశాడనేదే మిగతా స్టోరీ. ఇందులో అజయ్ ఘోష్ తప్పితే సగటు ప్రేక్షకుడికి తెలిసిన నటీనటులు పెద్దగా లేరు.

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే హిట్ 3, రెట్రో, తుడరుమ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, డీమన్ తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో చాలావరకు రీసెంట్ టైంలో రిలీజై ప్రేక్షకుల్ని అలరించడం విశేషం.

(ఇదీ చదవండి: శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)