Breaking News

ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Fri, 04/18/2025 - 12:25

పేరుకే తమిళ హీరో గానీ విక్రమ్ కి తెలుగులోనూ బోలెడంతమంది అభిమానులు ఉన్నారు. ఇతడు అందరిలా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా కాస్త వైవిధ్యంగా ఉండే సినిమాలు తీస్తుంటాడు. దీంతో అప్పుడో ఇప్పుడో అన్నట్లు హిట్స్ పడుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ఇతడి కొత్త సినిమా నెలలోపే ఓటీటీలోకి(OTT Movie) వచ్చేస్తోంది.

విక్రమ్(Vikram)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వీరధీరశూర'(Veera Dheera Sooran Movie). యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తీసిన ఈ సినిమాలో ఎస్జే సూర్య, సూరజ్ వెంజుమోడ్ లాంటి స్టార్స్ నటించారు. అయితే మార్చి 27న ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజైంది. అదే టైంకి తెలుగులో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ రిలీజ్ కావడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

(ఇదీ చదవండి: ట్రిపుల్‌ ట్రీట్‌.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో.. )

మరోవైపు ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడం కూడా మైనస్ అయిందని చెప్పొచ్చు. అలా చాలామంది చూడకుండానే థియేటర్లలో నుంచి ఈ సినిమా తీసేశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. 

'వీరధీరశూర' విషయానికొస్తే.. కాళి (విక్రమ్) ఓ కిరాణా దుకాణం నడుపుతుంటాడు. భార్య వాణి, పిల్లలతో ప్రశాంతంగా బతికేస్తుంటాడు. కానీ కాళి గతం వేరు. రవి (పృథ్వీ) దగ్గర చాన్నాళ్లు పనిచేసుంటాడు. ఓ రోజు రవి వచ్చి కాళిని సాయం అడుగుతాడు. త‌న‌ని, త‌న కొడుకు క‌న్నా (సూర‌జ్ వెంజ‌ర‌మూడు)ని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకున్న ఎస్పీ అరుణ‌గిరి (ఎస్‌.జె.సూర్య‌)ని అంతం చేయాల‌ని అంటాడు. దీనికి కాళి ఒప్పుకోవ‌ల్సిన ప‌రిస్థితులు ఎందుకొచ్చాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'కోర్ట్‌' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌) 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)