Breaking News

రూ.80 కోట్ల మోసం.. ఆ డెరెక్టర్‌ పెద్ద మోసగాడు: ప్రముఖ నిర్మాత

Published on Tue, 09/09/2025 - 17:52

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ సంచలన ఆరోపణలు చేశారు. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్‌ తనను మోసం చేశారంటూ కామెంట్స్ చేశారు. సినిమా నిర్మాణంలో దాదాపు రూ.80 కోట్ల వరకు అవతవకలకు పాల్పడారంటూ ఆరోపించారు.  అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా నిర్మించే సమయంలో తన ఫేక్ కంపెనీతో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడని వాసు భగ్నానీ వెల్లడించారు.

తన ఫేక్ కంపెనీ పేరుతో ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబుదాబిలో రిజిస్టర్ చేసిన కంపెనీ పేరుతో.. ముంబయిలో జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌సీ పేరుతో మనీలాండరింగ్ చేశాడని అన్నారు. సినిమా బడ్జెట్‌ను దాదాపు రూ. 80 కోట్లు పెంచారని భగ్నాని వెల్లడించారు. ఆఖరికి నటీనటుల పారితోషికం తగ్గించినా భారీ మోసం కావడంతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేవలం నా డబ్బును తిరిగి పొందడం మాత్రమే కాదు. మరే ఇతర నిర్మాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని నిజం బయటకు రావాలని పోరాడుతున్నట్లు వాసు భగ్నానీ అన్నారు.

నిర్మాత వాసు భగ్నానీ మాట్లాడుతూ.. 'అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా.. ఏఏజెడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారు. మేము బడే మియాన్ చోటే మియాన్ మూవీ కోసం వారితో జతకట్టా. నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక సహాయం కూడా చేశా. వారికి దర్శకత్వాన్ని బాధ్యతలు అప్పగించా. సృజనాత్మక నిర్ణయాలలో తాను పెద్దగా జోక్యం చేసుకోలేదని.. లండన్‌తో పాటు ఇండియాలో జాఫర్ సూచించిన షూటింగ్ ప్రదేశాలను ఆమోదించా. అయితే రెండు నెలల క్రితమే జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌సీ సంస్థ గురించి తెలుసుకున్నా. అది జాఫర్ సహాయకుడి పేరుతో రిజిస్టర్ చేశారు. ఇదంతా బయటికి రాకుండా రహస్యంగా నిర్వహించారు. సినిమా ఖర్చులను పెంచడం, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు" అని అన్నారు. కాగా.. గతంలో బాలీవుడ్‌ నిర్మాత, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టామని ఆవేదన చెందారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)