Breaking News

శ్రీవారిని దర్శించుకున్న మట్కా టీమ్.. వీడియో వైరల్!

Published on Wed, 11/13/2024 - 13:51

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పోటీకి రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ సూర్య మూవీ కంగువాతో బాక్సాఫీస్ బరిలో నిలిచింది. మట్కా, జూదం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల వైజాగ్‌లో మట్కా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు.

తాజాగా మట్కా టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు టీమ్ అంతా కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మూవీ సూపర్ హిట్‌ కావాలని ప్రత్యేక పూజులు చేశారు. వీరికి ఆలయ పండితులు మర్యాదలతో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇవాళ తిరుపతిలోని ఎన్‌విఆర్ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌కు  హాజరుకానున్నారు. కాగా.. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోన్న మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో తెలుగులో నోరా ఫతేహీ అరంగేట్రం చేయనుంది. మట్కా జూదగాడైన రతన్ ఖేత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సలోని అశ్వని, సత్యం రాజేష్, పి రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)