Breaking News

నాకు కాబోయే వాడికి ఇది రెండో పెళ్లి.. అయితే ఏంటి?: వ‌ర‌ల‌క్ష్మి

Published on Sun, 05/05/2024 - 08:06

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌... టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట‌ర్‌గా మారిపోయింది. క్రాక్‌, నాంది, య‌శోద‌, వీర‌సింహారెడ్డి, కోట‌బొమ్మాళి పీఎస్‌, హ‌నుమాన్‌.. ఇలా వ‌రుస‌గా అన్నీ విజ‌యాలే అందుకుంది. ఇటీవ‌లే ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన శ‌బ‌రి చిత్రం రిలీజైంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ మీడియ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన వ‌ర‌ల‌క్ష్మి త‌న‌కు కాబోయే భ‌ర్త గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది.

ఆ క్వాలిటీ న‌చ్చింది
'నికోల‌య్‌కు, నాకు మధ్య అనుకోకుండా ప్రేమ పుట్టింది. అత‌డు నా వృత్తిని గౌర‌విస్తాడు. సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చో అని ఎన్న‌డూ చెప్ప‌లేదు. పైగా త‌ను న‌న్ను చూసి గ‌ర్వ‌ప‌డ‌తాడు. నాతో పాటు షూటింగ్‌కు వ‌చ్చి ఖుషీ అవుతుంటాడు. నేను చేసే ప‌నిని ఎంజాయ్ చేస్తాడు. ఆ క్వాలిటీ నాకు బాగా న‌చ్చింది. నా జీవితాన్ని అత‌డితో పంచుకోవాల‌నిపించింది. ఇద్ద‌రం ఒక‌రికొక‌రం స‌పోర్ట్ చేసుకుంటాం.

అదే ఆయ‌న చేసే ప‌ని
అత‌డు గ్యాల‌రిస్టు.. అంటే పెద్ద‌పెద్ద క‌ళాకారులు వేసే పెయింటింగ్స్‌ను కొనుక్కుంటూ అమ్ముతుంటాడు. అదే ఆయ‌న చేసే ప‌ని! నా భ‌ర్త‌కు ఇదివ‌ర‌కే పెళ్ల‌యింద‌ని వార్త‌లు రాశారు. అది నిజ‌మే! అయినా త‌న‌కు ఆల్‌రెడీ పెళ్ల‌యితే త‌ప్పేముంది?  దీని గురించి మాట్లాడేవారికి ఒక‌టే చెప్తున్నా.. మీ ప‌ని మీరు చూసుకోండి.

డ‌బ్బు కోస‌మే పెళ్లి?
అంద‌రూ ఐశ్వ‌ర్య‌రాయ్‌, బ్రాడ్‌పిట్‌లేం కాదు. ముందు మీ ముఖాలు మీరు చూసుకోండి. మీరు ఏం అనుకుంటున్నార‌నేది నాక‌వ‌స‌ర‌మే లేదు. నా లైఫ్ నా ఇష్టం. డ‌బ్బుల కోస‌మే పెళ్లి చేసుకుంటోంద‌ని కూడా అన్నారు. డ‌బ్బు నా ద‌గ్గ‌ర కూడా ఉంది. ఆయ‌న ద‌గ్గ‌ర తీసుకోవాల్సిన అవ‌స‌రం నాకు లేదు. మీకు న‌చ్చింది అనుకోండి.. డోంట్ కేర్' అని వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ చెప్పుకొచ్చింది.

 చ‌ద‌వండి: రెండు సార్లు ప్రేమలో విఫల‌మైన హీరో.. ఆ ఇద్దరి హీరోయిన్ల వల్లే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)