Breaking News

తండ్రి ఎమోషనల్‌.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి

Published on Mon, 01/16/2023 - 08:32

సంక్రాంతి రోజున ఓ వీడియో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యారు ప్రముఖ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి. ఆయన తాజాగా తెరకెక్కించిన మూవీ వారసుడు(తమిళంలో వారీసు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పండుగ రోజున వంశీ తన తల్లి, తండ్రి, భార్యతో కలిసి కుటుంబ సమేతంగా థియేటర్లో వారసుడు మూవీ చూశారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన

ఇక ఈ సినిమా చూసిన వంశీ పైడితల్లి తండ్రి సైతం భావోద్వేగానికి గురయ్యారు. పుత్రోత్సాహంతో ఆయనను హుత్తుకుని ఎమోషనల్‌ అయిన వీడియో వంశీ పైడిపల్లి షేర్‌ చేశారు. ‘‘నా జీవితంలో అతి పెద్ద విజయం సాధించాను. ‘వారసుడు’ వీక్షించి నా తండ్రి ఎంతగానో ఆనందించారు. ఈరోజు నేను నా జీవితంలో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాను. జీవితాంతం ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. నాన్నా.. నువ్వే నా హీరో. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ వంశీ రాసుకొచ్చారు. 

చదవండి: ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..?

‘మహర్షి’ వంటి కమర్షియల్‌ విజయం తర్వాత వంశీ తెరకెక్కించిన పూర్తిస్థాయి తమిళ చిత్రం ‘వారీసు’. తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో విజయ్‌ సరసన రష్మిక మందన్నా నటించగా.. జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్‌, శ్రీకాంత్‌‌, శ్యామ్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. తమిళంలో  ఈ చిత్రం జనవరి 11న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)