Breaking News

9 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వడ్డే నవీన్‌.. ఇప్పుడేం చేస్తున్నారంటే?

Published on Fri, 07/11/2025 - 12:55

సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌ సంపాదిస్తే సరిపోదు, దాన్ని అలాగే కాపాడుకోగలిగాలి. లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా వెండితెరపై కనిపించకుండా పోతారు. టాలీవుడ్‌ హీరో వడ్డే నవీన్‌ (Vadde Naveen) విషయంలో ఇదే జరిగింది. ఒకప్పుడు ఎన్నో హిట్‌ సినిమాలు చేసిన ఇతడు చాలా కాలంగా తెలుగు తెరకు కనిపించకుండా పోయాడు.

కెరీర్‌ అలా మొదలైంది
ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్‌ కుమారుడిగా నవీన్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కోరుకున్న ప్రియుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా పెళ్లితో నవీన్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి పలు సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. చివరగా 2016లో ఎటాక్‌ చిత్రంలో కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. 

రీఎంట్రీ ఇలా ప్లాన్‌ చేశాడా?
9 ఏళ్ల తర్వాత ఇతడు విలన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. యాక్టింగ్‌ సంగతి పక్కనపెడితే నవీన్‌ నిర్మాతగా మారనున్నాడు. వడ్డే క్రియేషన్స్‌ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నటుడిగా కమ్‌బ్యాక్‌ ఇస్తాడనుకుంటే ఇలా నిర్మాత అవతారం ఎత్తి ట్విస్ట్‌ ఇచ్చాడంటున్నారు అభిమానులు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో నవీన్‌ సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నారు.

 

 

చదవండి: ఒక్క సినిమాకు 150 కట్స్‌.. విడుదలకు ముందే కోర్టు స్టే

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య