Breaking News

సన్నగా ఉన్నావు.. ఆ పాత్రకు పనికిరావు అనేవారు: బాలీవుడ్ నటి

Published on Tue, 07/22/2025 - 17:36

బాలీవుడ్ నటి వాణికపూర్ ప్రస్తుతం క్రేజీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ మండల మర్డర్స్. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈనెల 25 నుంచి సందడి చేయనుంది. ఈ సిరీస్‌లో వాణీకపూర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని శతాబ్దాల కిందట చరణ్‌దాస్‌పూర్‌లో జరిగిన హత్యల నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో నిర్మించారు.

తాజాగా ఈ ‍సిరీస్‌ ప్రమోషన్లతో బిజీగా వాణి కపూర్ కెరీర్ ప్రారంభంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సవాళ్లను ప్రస్తావించింది. తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు వెల్లడించింది. తన స్కిన్ టోన్ కారణంగా ఓ సినిమాలో పాత్రకు రిజెక్ట్ చేశారని తెలిపింది. తాను చాలా సన్నగా ఉండటం వల్ల తరచుగా బాడీ షేమింగ్‌కు గురయ్యానని పేర్కొంది.

తాజా ఇంటర్వ్యూలో వాణి కపూర్ మాట్లాడుతూ.. 'కెరీర్ మొదట్లో తనను రిజెక్ట్ చేయడం.. తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఒక చిత్రనిర్మాత ఒకసారి నేను పాత్రకు న్యాయం చేయలేదని అన్నారు. తనను 'మిల్కీ వైట్'ని కాదని అన్నారు. ఆ విషయాన్ని తాను నేరుగా కాకపోయినా.. ఇతరుల ద్వారా తెలుసుకున్నా. తనపై ఎలాంటి కామెంట్స్ చేసినా తన గుర్తింపు, సామర్థ్యాలపై తనకు పూర్తిగా నమ్మకముంది. తాను సన్నగా ఉన్నానని..  బరువు పెరగాలని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ నేనేంటో నాకు తెలుసు. నాలా ఉండటమే నాకిష్టం' అంటూ బాలీవుడ్ భామ చెప్పుకొచ్చింది. కాగా.. మండల మర్డర్స్‌ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా పిల్గావ్‌కర్, జమీల్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)