Breaking News

ఓటీటీలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్!

Published on Mon, 06/30/2025 - 19:00

ఓటీటీల్లో మిస్టరీ థ్రిల్లర్స్‌కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఓటీటీలో ఇలాంటి కంటెంట్‌నే ఆడియన్స్‌ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సరికొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు, చిత్రాలు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణి కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మండల మర్డర్స్‌ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలై 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌  కొత్త పోస్టర్‌ను నెట్‌ఫ్లిక్స్  విడుదల చేసింది. ఈ సిరీస్‌లో వాణికపూర్ తొలిసారి డిటెక్టివ్ ‍పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను చరణ్‌దాస్‌పూర్ పట్టణం నేపథ్యంలో తెరకెక్కించారు. శతాబ్దాల క్రితం జరిగిన హత్యల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో నిర్మించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌  సిరీస్‌కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని నిర్మించారు. 'ది రైల్వే మెన్' (2023) తర్వాత నెట్‌ఫ్లిక్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వస్తోన్న సిరీస్‌ ఇదే కావడం విశేషం.
 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)