Breaking News

ఐఐటీయన్‌గా హీరోయిన్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!

Published on Sun, 06/11/2023 - 20:19

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బీ టౌన్‌తో పాటు టాలీవుడ్‌కు కూడా సుపరిచితమే. మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యలో స్పెషల్‌ సాంగ్‌లో అదరగొట్టింది. వేర్ ఈజ్‌ ది పార్టీ టాలీవుడ్ సినీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్‌లోనూ స్పెషల్ సాంగ్ వైల్ట్ సాలా అంటూ అభిమానులను ఊర్రూతలుగించింది. అయితే గతంలో టీమిండియా క్రికెటర్ రిషబ్‌ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!)

సినీ తారలపై ట్రోల్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఊర్వశి రౌతేలా మరోసారి ట్రోల్స్‌కు గురైంది. ఎందుకంటే తన సోషల్ మీడియా ఖాతాలో ఐఐటీయన్ అని పేర్కొనడంపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు కొత్త కారు, కొత్త ఇల్లు ఉండొచ్చు.. కానీ ఆమె ఐఐటీయన్ అని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఇదంతా ఆమె గతంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బయోలో ఐఐటీయన్‌గా పేర్కొంది. ఇది చూసిన కొందరేమో ఆమె అప్పట్లో ఐఐటీలో చేరాలనుకున్నది అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఐఐటీయన్ అన్న ట్యాగ్‌ను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. కానీ ఆమె అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఇప్పటికీ ఐఐటీయన్‌గానే చూపిస్తోంది. 

కాగా.. గతంలో ఊర్వశి ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ తాను సైన్స్ గ్రాడ్యుయేట్ అని తెలిపింది. అంతే కాకుండా ఐఐటీ ఎంట్రన్స్‌ను క్లియర్ చేశానని చెప్పింది. ఆ తర్వాత తాను ఐఏఎస్‌ కోసం కూడా సిద్ధమైనట్లు వివరించింది. చివరికీ ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకుంది.. కానీ ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత సన్నీ డియోల్, అమృతా రావుతో కలిసి సింగ్ సాబ్ ది గ్రేట్‌తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది.

(ఇది చదవండి:  సుశాంత్‌ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)