Breaking News

సీమ రమ్మంది... స్టోరీ ఉందంది

Published on Mon, 06/22/2026 - 03:51

రాయలసీమ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి.  ఇంకా ఎన్నో సినిమాలు చేయొచ్చంటూ రచయితలను–దర్శకులను ‘సీమ రమ్మంది... స్టోరీ ఉందంది’. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, విడుదలకు సిద్ధమైన ‘రాయలసీమ’ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు కొన్ని ఉన్నాయి.  ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.

నవ్వుల కోలాటం 
వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో నవ్వుల కోలాటం అంటున్నారు అనిల్‌ రావిపూడి. వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘వెంకీఅనిల్‌5 అండ్‌ ఎన్‌కేఆర్‌ఏఆర్‌2’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే ఎంటర్‌టైనింగ్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ నేడు ఆరంభం కానుంది.

‘కత్తిలాంటి ఐడియా’ అంటూ ఓ వినోదాత్మక కాన్సెప్ట్‌ వీడియోను ఆదివారం రిలీజ్‌ చేసి, ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని ఈ వీడియోతో స్పష్టం చేశారు అనిల్‌ రావిపూడి. ఈ చిత్రానికి ‘జనవరి 13న రిలీజ్, బామ్మర్ది బాల్‌రెడ్డి’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. జీ స్టూడియోస్, సురేష్‌ ప్రోడక్షన్స్, అర్చనల సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.

ప్రేమ కోసం లెనిన్‌ 
‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు’ అనే క్యాప్షన్‌తో ‘లెనిన్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తన ప్రేమ కోసం లెనిన్‌ ఏ స్థాయిలో పోరాటం చేస్తాడో ఈ క్యాప్షన్‌ స్పష్టం చేస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, కుటుంబం, రాజకీయ అంశాలతో రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా ‘లెనిన్‌’ సినిమా రూపొందింది. ఈ చిత్రకథలో ‘ప్రేమ’ ప్రధానాంశంగా ఉంటుందని ఆ మధ్య విడుదలైన ‘సోల్‌ ఆఫ్‌ లెనిన్‌’ వీడియో కూడా స్పష్టం చేసింది.

లెనిన్‌పాత్రలో అక్కినేని అఖిల్‌ హీరోగా, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత మాస్‌ లుక్‌లో ఈ చిత్రంలో అఖిల్‌ కనిపించనున్నారు. రాయలసీమ కుర్రాడిగా ఒదిగి΄ోవడానికి అఖిల్‌ చిత్తూరు యాసలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తనపాత్రకు డబ్బింగ్‌ కూడా చె΄్పారు. జూలై 10న ‘లెనిన్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

యోధుడు రణబాలి 
అది 19వ శతాబ్దం... ముఖ్యంగా 1854 – 1878 మధ్యకాలం. బ్రిటిష్‌పాలనలో కరువు కాటకాలతో రాయలసీమ అల్లాడుతోంది. అప్పుడే జనాల్లోంచి ఓ యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. బ్రిటిష్‌వారిపై ఆ యోధుడు తిరగబడ్డాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. ఇందులో యోధుడు రణబాలిపాత్రను విజయ్‌ దేవరకొండ, అతనికి జోడీగా జయమ్మపాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు.

రాయలసీమ ప్రజలు చేసిన పోరాటాలు, తిరుగుబాట్ల ఆధారంగా దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నాటి రాయలసీమ యాసలో శిక్షణ తీసుకోవడమే కాకుండా, గుర్రపు స్వారీలోనూ శిక్షణ పొందారు విజయ్‌ దేవరకొండ. ఈపాన్‌ ఇండియా చిత్రం సెప్టెంబర్‌ 11న రిలీజ్‌ కానుంది. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

కొరియన్‌ దెయ్యం 
వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన సినిమా ‘కొరియన్‌ కనకరాజు’. రితికా నాయక్‌ కథానాయికగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ చిత్రంలో కనకరాజు అనేపాత్రలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్నారని తెలిసింది. ఓ కొరియన్‌ దెయ్యానికి, కనకరాజుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది మాత్రం సినిమాలో చూడాలి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మంగాపురంలో ప్రేమ
సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాసా మంగాపురం’. రవీనాటాండన్‌ కుమార్తె రాషా తడానీ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రధానంగా తిరుపతికి దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది.

ఈ విలేజ్‌ లవ్‌స్టోరీ సినిమాలో శ్రీనుపాత్రలో జయకృష్ణ, మంగపాత్రలో రాషా నటిం చారు. సి. అశ్వినీదత్‌ సమర్పణలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 9న రిలీజ్‌ కానుంది. ఇంకా సాయిదుర్గా తేజ్‌ హీరోగా రోహిత్‌ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’తోపాటు  రాయలసీమ నేపథ్యంలో రానున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.                    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)