Breaking News

కెరీరే కావాలి.. ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఈ పని చేయండి: ఉపాసన

Published on Thu, 03/07/2024 - 16:46

రామ్‌చరణ్‌ నీడలో ఉండటం సంతోషంగా ఉందంటోంది ఉపాసన. తన భార్య మంచి ఇల్లాలని, తను చేసే గొప్ప పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయంటున్నాడు రామ్‌చరణ్‌. మార్చి 8న ఉమెన్స్‌ డే. ఈ సందర్భంగా చరణ్‌ దంపతులు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముందుగా ఉపాసన మాట్లాడుతూ.. 'మా ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు కావడంతో పెళ్లవగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లనిపించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. తనకు నీడగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నాను. పరస్పరం సపోర్ట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.

ఆత్మవిశ్వాసంతో పెంచారు
మా తాతయ్య స్త్రీ మూర్తులను ఎక్కువగా పూజించేవారు. మా అమ్మవాళ్లను ఎంతో ఆత్మవిశ్వాసంతో పెంచారు. మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఇది స్త్రీ లోకం అని భావించే ఇంట్లో నేను పుట్టిపెరిగాను అని చెప్పుకొచ్చింది. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ఉపాసన కేవలం నా భార్య కావడం వల్లే గుర్తింపు రాలేదు. తను చేసే మంచి పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. పలు రంగాల్లో తనకు ప్రావీణ్యం ఉంది. ఇంట్లో కుటుంబంతో ఉన్నా లేదా ఏదైనా ప్రాజెక్టుల ద్వారా పలువురికి సేవ చేయాలన్నా ఎంతో నిబద్ధతగా వ్యవహరిస్తుంది. వారసత్వాన్ని ఎంతో అందంగా ముందుకు తీసుకెళ్తుంది అని పేర్కొన్నాడు.

ఆలోచనల్లో మార్పు రావాలి
పిల్లలు పుట్టగానే చాలామంది ఉద్యోగాలు మానేస్తుంటారు? ఎందుకిలా అన్న ప్రశ్నకు ఉపాసన మాట్లాడుతూ.. ఒకసారి తల్లయ్యాక మునుపటిలా పని చేయడం కత్తిమీద సాములాగే ఉంది. ఎంత ప్రయత్నించినా పని చేయడం కష్టమవుతోంది.. చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ముందు ఈ ఆలోచనా ధోరణి మారాలి. అలాగే కంపెనీల్లో కూడా మహిళలకు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పుచేర్పులు చేయాలి. మెటర్నటీ లీవ్స్‌.. మహిళలు వారి అవసరాలకు తగ్గట్లు తీసుకునేలా అవకాశం కల్పించాలి. దీని గురించి ఇప్పటికే నేను కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నాను.

పిల్లలు తర్వాత అనుకునేవారు..
ముఖ్యమైన విషయం ఏంటంటే? ఆడవాళ్లు వారి ఎగ్స్‌ను కాపాడుకోవాలి. వాటిని ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలి. జీవితంలో సెటిలవ్వాలి, తర్వాతే పిల్లల కోసం ప్రయత్నిద్దాం అనుకునేవారు వారి ఎగ్స్‌(అండాలు) దాచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇప్పుడు పిల్లల్ని కనొచ్చు అనుకున్నప్పుడు ఆ ఎగ్స్‌ మీకు ఉపయోగపడతాయి. ఈ విధానం మహిళలకే కాదు దేశ పురోగతికి సైతం సాయపడుతుంది. నేను కూడా నా ఎగ్స్‌ దాచుకున్నాను. కరెక్ట్‌ సమయమిదే అనిపించినప్పుడే క్లీంకారను కన్నాం' అని తెలిపింది.

చదవండి: ప్రీవెడ్డింగ్‌.. ఖాన్స్‌ త్రయంతో పాటు రామ్‌చరణ్‌కు భారీగానే ముట్టిందా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)