Breaking News

ఆ విషయంలో చరణ్‌పై జెలసీ.. ఉపాసన ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

Published on Wed, 02/07/2024 - 17:15

మెగా కోడలు ఉపాసన ఫుల్‌ సంతోషంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు తన కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణ్‌లు ఉన్నారు. చిరంజీవికి ఈ మధ్యే పద్మవిభూషణ్‌ రాగా ఆమె తాతయ్య, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్‌ సి రెడ్డికి 14 ఏళ్ల క్రితమే ఈ పురస్కారం వరించింది. సోమవారం (ఫిబ్రవరి 5న) ఈయన 91వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చెన్నైలో జన్మదినోత్సవ వేడుక జరిపారు.

నేనే ఎక్కువ మాట్లాడుతా
ఈ సెలబ్రేషన్స్‌ వేడుకలో ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్‌ బుక్‌ను డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాసన కొందరికి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. చరణ్‌ వింటూ ఉంటాడు. నేను బయటకు వెళ్లినప్పుడు అతడు క్లీంకారను చూసుకుంటాడు. తను బయటకు వెళ్తే నేను చూసుకుంటాను.

జెలసీగా అనిపిస్తుంది
ఒక విషయం గురించైతే నాకు మాట్లాడటానికి కూడా ఇష్టం లేదు (నవ్వుతూ). ఆడపిల్లలు నాన్నకూచి అంటుంటారు కదా.. అది నిజం. నా విషయంలోనూ అదే జరిగింది. చరణ్‌ను చూడగానే క్లీంకార ముఖం వెలిగిపోతుంది. సంతోషంతో కనురెప్పలు ఆడిస్తుంది. అది చూస్తే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. అయితే చరణ్‌ తనను చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అతడు నాకు భర్త మాత్రమే కాదు స్నేహితుడు కూడా! అన్ని విషయాలు నాతో పంచుకుంటాడు.

నాతోనే కెమిస్ట్రీ బాగుంటుంది
కొన్నిసార్లు అతడి సినిమాల్లో హీరోయిన్‌తో కలిసి చేసిన సీన్లు చూసినప్పుడు ఏంటిదని అడిగేదాన్ని. ఇది నా వృత్తి. అర్థం చేసుకో.. దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే! అని చెప్పేవాడు. సరేలే అని వదిలేసేదాన్ని. ఏదో సరదాగా అడుగుతా కానీ, అతడు ఏ హీరోయిన్‌తో నటించినా పట్టించుకోను. హీరోయిన్స్‌ కన్నా నాతోనే తన కెమిస్ట్రీ బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా చరణ్‌- ఉపాసనల పెళ్లి 2012లో జరిగింది. గతేడాది వీరు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. లలితా సహస్రనామాల్లో ఒకటైన క్లీంకార అనే పేరును కూతురికి నామకరణం చేశారు.

చదవండి: సారాంశ్‌.. రియల్‌ లైఫ్‌ స్టోరీ.. ఒక్కగానొక్క కొడుకు మరణం.. పీక్కుతిన్నారు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)