Breaking News

ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన

Published on Sun, 09/28/2025 - 10:57

మెగా హీరో రామ్‌చరణ్‌ సతీమణి, బిజినెస్‌ ఉమెన్‌ ఉపాసన (Upasana Konidela) బతుకమ్మ ఆడారు. తెలంగాణ పండుగను దేశరాజధాని ఢిల్లీలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ కళాశాలలో శనివారం (సెప్టెంబర్‌ 27న) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సీజన్‌లో నా మొదటి బతుకమ్మను రేఖాగారితో జరుపుకున్నాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. 

కాలేజీ స్టూడెంట్స్‌తో బతుకమ్మ
ఇందులో ఉపాసన, రేఖా గుప్త.. కాలేజీ విద్యార్థులతో కలిసి అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడారు. పండుగ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం రేఖా.. ఆయా ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. బతుకమ్మ అంటే పూల పండగ మాత్రమే కాదు. మాతృత్వం, జీవితం, ప్రకృతిని సెలబ్రేట్‌ చేసుకోవడం..

మాతో కలిసి బతుకుమ్మ జరుపుకున్నందుకు థాంక్స్‌
ఢిల్లీలో ఉన్న తెలుగువారు ఈ నగర అభివృద్ధిలోనూ భాగమయ్యారు. తమ సంస్కృతికి కొత్తరంగులు అద్దారు. ఈ పండగ సందర్భంగా.. మనందరం మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని తర్వాతి తరాలకు అందివ్వాలని ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ పోస్ట్‌కు ఉపాసన స్పందిస్తూ.. రేఖా గుప్తాగారు మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి. తెలంగాణ సంస్కృతిని సెలబ్రేట్‌ చేస్తూ, బతుకమ్మ పండగను మాతో కలిసి జరుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు.

 

 

చదవండి: నేనేం తప్పు చేశానని..? డార్క్‌ రూమ్‌లో కూర్చుని ఏడ్చా: తమన్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)