పవన్ కల్యాణ్ మూవీలో సాంగ్‌.. ఆ కారణంతో చేయనని చెప్పా: ఉదయభాను

Published on Wed, 08/20/2025 - 16:49

టాలీవుడ్‌లో యాంకర్‌ గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. నటిగానూ రాణించింది. పలు సినిమాల్లో సూపర్ హిట్‌ సాంగ్స్‌లోనూ మెప్పించిన ఉదయభాను.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బార్బరిక్ త్రిబాణధారి మూవీతో మరోసారి అభిమానులను పలకరించేందుకు వస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఉదయభాను కొన్ని సినిమాల్లో పాటలు చేయడానికి నో చెప్పానని తెలిపింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో పార్టీ సాంగ్‌కు నో చెప్పేశానని వెల్లడించింది. నాకు స్క్రిప్ట్‌ నచ్చకపోతే డైరెక్టర్‌తోనే నేరుగా వేరేవాళ్లను తీసుకోమని చెప్పానన్నారు. అందుకే త్రివిక్రమ్ మూవీలోనూ సాంగ్‌ చేయనని చెప్పానని ఉదయభాను తెలిపారు. అయితే ఆ సాంగ్ చేసేందుకు భయపడ్డానని.. అంత పెద్ద స్టార్స్‌ మధ్య పార్టీ సాంగ్ కావడంతో చేసేందుకు వెనకడుగు వేశానని ఉదయభాను పేర్కొంది.

కాగా.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2013లో రిలీజైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)