Breaking News

వాళ్లు విడిపోలేదు.. అవన్నీ రూమర్స్ మాత్రమే

Published on Fri, 11/13/2026 - 14:48

గత నెల చివరలో 'ఆదర్శ కుటుంబం' రిలీజైంది. వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. అయితే దీని ప్రభావం.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీపై పడిందని.. ఈ ప్రాజెక్ట్ సదరు నిర్మాణ సంస్థ నుంచి చేతులు మారిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు వీటిపై స్వయంగా నిర్మాణ సంస్థనే క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: మౌళి 'డీఎన్‌కే' (దొంగ నా కొడుకు) రివ్యూ)

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా గాడ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని చాలారోజుల క్రితమే ప్రకటించారు. దీనిని హారిక-హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అయితే 'ఆదర్శ కుటుంబం' ఫ్లాప్ దెబ్బకు హారిక సంస్థతో త్రివిక్రమ్ విడిపోయారని.. మరో బడా నిర్మాణ సంస్థతో చేతులు కలిపారని.. ఎన్టీఆర్ మూవీ కూడా ఇందులో ఉంటుందని టాక్ చాలానే వినిపించింది.

అయితే ఇవన్నీ రూమర్లు మాత్రమేనని హారిక-హాసిని సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్.. నిర్మాతలు చినబాబు, కల్యాణ్ రామ్‌తో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లుయింది. ప్రస్తుతం 'డ్రాగన్' షూటింగ్‌లో తారక్ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఇది పూర్తయిపోవచ్చు. తర్వాతే త్రివిక్రమ్ తీసే గాడ్ ఆఫ్ వార్ చిత్రీకరణ మొదలు కానుంది.

(ఇదీ చదవండి: అదో పీడకల.. దేవుడి దయ వల్ల నేను బతికాను: కాజల్ అగర్వాల్)

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు