Breaking News

త్రివిక్రమ్- వెంకీ కాంబో.. ఆ టైటిల్‌ ఫిక్స్..!

Published on Tue, 12/02/2025 - 18:46

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

అయితే మరోవైపు ఈ మూవీ టైటిల్‌పై కూడా టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్‌పై సినీ ప్రియుల్లో చర్చ మొదలైంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్- వెంకటేశ్ మూవీకి టైటిల్‌ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. 'బంధు మిత్రుల అభినందనలతో' అనే టైటిల్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రం వెంకీ మామ కెరీర్‌లో 77వ సినిమాగా నిలవనుంది. ఈ సినిమా వెంకీతో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. గతంలో నువ్వు నాకు నచ్చవ్, వాసు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ మూవీని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)