Breaking News

స్టార్‌ హీరోపై అభిమానం.. స్పెషల్‌ సాంగ్‌కు త్రిష ఓకే

Published on Tue, 08/27/2024 - 06:44

ఐటం సాంగ్స్‌లో నటించడానికి నటీమణులకు నిర్మాతలు భారీ మొత్తం చెల్లిస్తుంటారు. అందుకు ఉదాహరణ నటి తమన్నా. ఈమె చాలా చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేశారు. తాజాగా నటి త్రిష గోట్‌ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం)  చిత్రంలో ప్రత్యేక పాటలో మెరవనున్నారు. దీని గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా, చిత్ర వర్గాలు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. విజయ్‌ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం గోట్‌. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఎజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఇందులో ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌, మైక్‌ మోహన్‌, ప్రేమ్‌జీ, నటి మీనాక్షీ చౌదరి, స్నేహ, లైలా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

యువన్‌శంకర్‌ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబరు 5న భారీ ఎత్తున్న విడుదలకు సిద్ధం అవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత వరకూ నిర్వహించ లేదు. కారణం ఇంతకు ముందు విజయ్‌ నటించిన చిత్రాల ఆడియో విడుదల వేడుకల సమయంలో పలు సమస్యలు ఎదురు కావడమే కావచ్చు. అయితే గోట్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేదీ, లేనిదీ త్వరలోనే వెల్లడిస్తామని క్రియేటివ్‌ నిర్మాత అర్చన ఇటీవల పేర్కొన్నారు. అయితే దాని గురించి ఇప్పటి వరకూ తెలపలేదు. ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు, టీజర్‌ విడుదలై గోట్‌ చిత్రంపై అంచనాలను పెంచేశాయి. 

తాజాగా నాలుగో పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెంకట్‌ ప్రభు తెలిపారు. విజయ్‌తో నటి త్రిష నటించిన ప్రత్యేక పాటనే అయ్యి ఉంటుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా గోట్‌ చిత్రంలోని నాలుగవ పాట విడుదల కోసం విజయ్‌ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు త్రిష మరే సినిమాలోనూ ఐటం సాంగ్‌ చేయలేదు. విజయ్‌పై అభిమానంతో గోట్‌ సినిమాలో ప్రత్యేకమైన సాంగ్‌ చేసేందకు గ్రీన్‌ ఇచ్చిందని కోలివుడ్‌లో ప్రచారం జరుగుతుంది.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)