Breaking News

త్రిష షాకింగ్‌ ట్వీట్‌.. ఇలా అవమానిస్తారా?

Published on Sat, 05/02/2026 - 11:44

సినిమాల్లో నటించడమే కాదు దాన్ని ప్రమోషన్స్‌లో పాల్గొనడం కూడా హీరోహీరోయిన్ల బాధ్యత. ఇప్పుడు చాలా మంది ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. షూటింగ్‌ అయిపోయిందా.. ప్యాకప్‌ చెప్పేస్తున్నారు. ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్లలో చాలా మంది ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. అందులో త్రిష కూడా చేరిందని మొన్నటి వరకు ప్రచారం సాగింది. 

సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’(తెలుగులో వీరభద్రుడు) మూవీలో త్రిష హీరోయిన్‌గా చేసింది. మే 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిష హాజరుకాకపోవడంతో..ఆమెపై ట్రోలింగ్‌ మొదలైంది. మూవీ ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటుందని కొంతమంది నెటిజన్స్‌ విమర్శిస్తూ కామెంట్‌ చేశారు. అయితే అసలు విషయం ఏంటంటే.. అసలు ఆడియో లాంచ్‌ ఈవెంట్‌కి త్రిషకు ఆహ్వానమే అందలేదట. ఈ విషయాన్ని త్రిష పరోక్షంగా చెబుతూ.. ‘కరుప్పు’ టీమ్‌పై సెటైర్లు వేసింది.

త్రిష లుక్‌ వైరల్‌
కరుప్ప మేకర్స్‌ తాజాగా  త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆమె 'ప్రీతి' అనే లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. 37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో త్రిష కోర్టు రూమ్‌లో సీరియస్ లాయర్‌గా, మరో సీన్‌లో ఆకుపచ్చ చీరలో డ్యాన్స్ చేస్తూ మెరిశారు. 43 ఏళ్ల వయసులోనూ మరింత అందంగా కనిపించడంతో ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. త్రిష ఇంత యంగ్‌గా ఎలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

నేను కూడా మర్చిపోయా.. 
అయితే ఓ అభిమాని త్రిష లుక్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘కరుప్పు సినిమాలో త్రిష ఉందన్న విషయమే మర్చిపోయాను. ఆమె ఏజ్ రివర్స్ గేర్‌లో వెళ్తోంది" అని  ట్వీట్‌ చేశారు. దానికి త్రిష ఇలా రిప్లై ఇచ్చింది. "ధన్యవాదాలు. నేనూ మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా వారు ఇలా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది’ అని వ్యంగ్యంగా పేర్కొంది. 

ఇన్విటేషన్‌ మిస్‌ అయిందేమో
దీనిపై సూర్య అభిమాని స్పందిస్తూ.. ‘ఆడియో లాంచ్‌కే రాని మీకు ఇంత వెతకారం అవసరమా?’ అని ప్రశ్నించారు. దానికి త్రిష బదులిస్తూ.. ‘నా ఇన్విటేషన్ బహుశా మెయిల్‌లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే’ అంటూ తనను ఆ వేడుకకు తనను ఆహ్వానించలేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పింది. ఆడియో లాంచ్ పోస్టర్లలో ఆమె పేరున్నప్పటికీ, పిలవకుండా పోస్టర్లు వేస్తే ఎలా వస్తారని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.‘చెత్త ప్రొడక్షన్‌ హౌస్‌.. ఒక స్టార్‌ హీరోయిన్‌ని ఇలా అవమానిస్తారా?’, ‘సూర్య ఈ విషయంపై స్పదించాలి’ అని కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)