Breaking News

19 ఏళ్లకే గర్భం దాల్చా.. ఇండియా వదిలి పోయాను: నటి

Published on Thu, 02/16/2023 - 13:29

మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది సోనమ్‌. త్రిదేవ్‌, విశ్వాత్మ, అజూబా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అర్ధాంతరంగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన సోనమ్‌ దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రీఎంట్రీకి రెడీ అయ్యింది. ఓ ఓటీటీ షోతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోనమ్‌.. సినిమాలు వదిలేయడానికి గల కారణాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

లాక్‌డౌన్‌లో ఓటీటీలో షోలు, సిరీస్‌లు చూశాను. ఇలాంటివి నేనెందుకు చేయకూడదు అనిపించింది. వెంటనే నా శరీరంపై దృష్టి పెట్టాను. ముప్పై కిలోలు తగ్గాను. నన్ను నేను మెరుగుపపర్చుకున్నాను. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యాను. 32 సంవత్సరాల తర్వాత మళ్లీ నటనారంగంలోకి వస్తుంటే కొంత సంతోషంగా మరికొంత భయంగానూ ఉంది.

► 1997లో ఇండియా వదిలివెళ్లిపోయాను. పద్నాలుగేళ్లకే పని చేయడం ప్రారంభించా. 19వ ఏటనే గర్భం దాల్చాను. జీవితంలో కష్టసుఖాలెన్నో చూశాను. లైఫ్‌ అన్నాక అన్నింటినీ దాటుకుంటూ పోవాలి కదా.. కానీ ఇప్పటికీ నేను ఇండస్ట్రీకి తిరిగి రావాలని కోరుకుంటుంటే హ్యాపీగా ఉంది.

మంచి కథ దొరికితే దానికి తగ్గట్లు ఎలాంటి పాత్రనైనా చేస్తా. 50 ఏళ్లకే వయసైపోలేదని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మహిళలకు చాటిచెప్పాలని ఉంది. ఎందుకంటే యాభై ఏళ్లు వచ్చాయంటే మహిళలు వారు అప్పటిదాకా ఉన్న ఐడెంటిటీని కోల్పోతున్నారు. నేనేమీ నా ముడతలను చూసి భయపడట్లేదు. నా లుక్స్‌కు తగ్గట్లు పాత్రలు వస్తే అలానే నటిస్తాను.

చదవండి: రజనీకాంత్‌కు షాకింగ్‌ రెమ్యునరేషన్‌.. అన్ని కోట్లా?

Videos

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

కడప టీడీపీ నేతలకు బాబు మొండిచెయ్యి

ఎల్లో మీడియాకు మద్యం కిక్కు తగ్గేలా లేదు..

Analyst Vijay babu: వాళ్లకు ఇచ్చిపడేశాడు హ్యాట్సాఫ్ నారాయణ..

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)